Sr NTR : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటనా ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు. నటనపై ఆయనకున్న మక్కువ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ ను భగవత్స్వరూపంగా భావించే ఆయన అభిమానులను అలరించడానికి ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. అలానే రాముడు అనే పేరు వచ్చేలా 15 సినిమాలు చేశారు. అవి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలే సాధించాయి.
ఎన్టీఆర్ హీరోగా రాముడు అనే పేరుతో వచ్చిన తొలి సినిమా అగ్గి రాముడు. 1954 ఆగస్టు 05న విడుదలైన ఈ సినిమా అప్పట్లో హిట్‌గా నిలిచింది. ఇక తర్వా చిత్రం శభాష్ రాముడు. ఈ సినిమా 1959 సెప్టెంబర్ 10న విడుదల అయింది. ఫలితం ఇది హిట్‌గానే నిలిచింది. అనంతరం బండ రాముడు చేశాడు. 1959 నవంబర్ 06న పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. ఇక 1961లో అక్టోబర్ 18న విడుదలైన టాక్సీ రాముడు సూపర్ హిట్‌గా నిలిచింది. సీ.ఎస్.రావు దర్శకత్వంలో 1962 మార్చి 08న విడుదలైన టైగర్ రాముడు కూడా సూపర్ హిట్‌గా నిలిచింది.
రాముడు భీముడు అనే చిత్రం 1964 మే 21న విడుదల కాగా, ఇది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక 1966 సెప్టెంబర్ 10న బి.విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా పిడుగు రాముడు సినిమా విడుదలైంది. ఇది కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. 1975 జూన్ 12న రాముని మించిన రాముడు సినిమా విడుదలైంది. ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు 1977లో విడుదలై కనివిని ఎరుగని రీతిలో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇక డ్రైవర్ రాముడు అనే పేరుతో రాఘవేంద్రరావు సినిమా తీయగా 1979 ఫిబ్రవరి 02న విడుదల అయి సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక శృంగార రాముడు చిత్రం యావరేజ్ గానే నడవగా, ఛాలెంజ్ రాముడు సూపర్ హిట్ అయింది. సర్కస్ రాముడు, సరదా రాముడు యావరేజ్‌గా ఆడగా, ఎన్టీఆర్ నటించిన కలియుగ రాముడు మాత్రం మంచి హిట్ అయింది. ఇలా రాముడు అనే పేరుతో వచ్చిన సినిమాలతో ఎన్‌టీఆర్ చాలానే హిట్లు కొట్టారు. ఆయనకు రాముడు అనే పేరు కలసి వచ్చిందని చెప్పవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…