Mahesh Babu : స్టూడెంట్ నెం 1 చిత్రంతో దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిన రాజమౌళి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా చవి చూడని రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో చెరిగిపోని రికార్డులని నమోదు చేసాడు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఒక సినిమా రాబోతుందని గతంలోనే ప్రకటించగా, ఆ సినిమాని ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తారో, ఎప్పుడెప్పుడు చూదామా అని ఫ్యాన్స్ కళ్లప్పగించి చూస్తున్నారు. కనీ విని ఎరుగని రీతిలో తన తదుపరి సినిమాని రూపొందించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం రాజమౌళి, ఆయన తండ్రి స్టార్ రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్.. మహేష్ సినిమా కోసం కథను తయారు చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. గ్లోబరేటింగ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీని మహేష్‌తో ఈ సినిమాని రూపొందించబోతున్నట్టు ఇటీవల జక్కన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ ఏజెన్సీ సీఏఏతో రాజమౌళి డీల్ చేసుకున్నారట. ఈ డీల్ వల్ల మహేష్ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్‌లో తీసుకెళ్లే మార్గం మరింత సులువుగా మారుతుందని అంటున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
వచ్చే ఏడాది మే నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం చిత్ర యూనిట్.. ప్రముఖ హాలీవుడ్ నటుడు శామ్యూల్ ఎల్ జాక్సన్ ను తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మార్వెల్ మూవీస్ తో ఇక్కడి వారికి కూడా పరిచయమైనా ఈ నటుడిని ముఖ్య తారాగణంగా తీసుకోవాలని దర్శకదీరుడు భావిస్తున్నాడట. ప్రస్తుతం మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే మహేష్ – రాజమౌళి సినిమా ట్రాక్ ఎక్కుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…