Bride : ఒకప్పుడు అంటే ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు ప్రజలకు సరైన మాధ్యమం ఉండేది కాదు. అందువల్ల ప్రజలు నాయకులను ప్రశ్నించేందుకు ముందుకు వచ్చే వారు కాదు. అయితే ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే ప్రజలు కూడా కొత్త టెక్నాలజీని వాడడం మొదలు పెట్టారు. ముఖ్యంగా వారు సోషల్ మీడియాను బాగా ఉపయోగిస్తున్నారు. దీంతో వారు ప్రశ్నించడం కూడా నేర్చుకున్నారు. నేతలు సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంటున్నారు కనుక.. ఆ మాధ్యమం ద్వారానే ప్రజలు కూడా వారిని కలుస్తున్నారు. తమ సమస్యలను విన్నవిస్తున్నారు. అంతేకాదు.. ఏ నాయకుడైనా లేదా ప్రభుత్వం అయినా సరిగ్గా పనిచేయకపోతే సోషల్ మీడియా వేదికగానే వారిని ప్రజలు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇక ఇలాంటి మార్గాన్నే ప్రస్తుతం చాలా మంది అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే ఓ వధువు చేసిన ఫొటోషూట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కేరళలో ఓ వధువు గుంతలు పడ్డ రోడ్లపై ఫొటోషూట్ చేసింది. ఆ రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నయి. గుంతలతో బురదనీటితో నిండి ఉన్నాయి. అయితే అలాంటి చోట ఆమె ఎందుకు ఫొటోషూట్ చేసింది.. అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమె ఫొటోషూట్ చేస్తున్న సమయంలో పక్క నుంచి వాహనాలు కూడా బురదను చిందించకుండా వెళ్లాయి. ఈ క్రమంలోనే ఆ వధువు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. అయితే ఆమె ఇలా చేసేందుకు బలమైన కారణమే ఉంది. అదేమిటంటే..
ఆ వధువు ఫొటోషూట్ చేసింది కేరళలో. అక్కడి రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ఎంతలా అంటే.. ఓ వ్యక్తి ఇటీవలే అక్కడ ఓ రోడ్డుపై గుంతలో పడి మృతి చెందాడు. దీంతో కేరళ హైకోర్టు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. రోడ్లను తక్షణమే బాగు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జాతీయ రహదారులను పర్యవేక్షించే ఎన్‌హెచ్ఏఐని కూడా ఆదేశించింది. అయితే చాలా చోట్ల రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అందుకు కారణమైన ప్రభుత్వాలను విమర్శించేందుకు.. ట్రోల్ చేసేందుకే ఆమె అలా ఫొటో షూట్ చేసింది. దీంతో ఆమెను అందరూ అభినందిస్తున్నారు. దీని వల్ల రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్నది దేశం మొత్తం తెలుస్తుందని.. అప్పుడు ఆ వార్త చూసి ప్రభుత్వాలు సిగ్గు పడాలని.. కనుక ఆ వధువు సరిగ్గానే చేసిందని అంటున్నారు. అయితే ఈ తరహా ట్రోల్స్‌ను చూసి అయినా ప్రభుత్వాలు మారుతాయో.. లేదో.. చూడాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…