Sr NTR : విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించారు. అంతేకాక విభిన్నమైన జానర్స్‌లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే పౌరాణిక, జానపద, సాంఘీకం ఇలా ఎన్నో సినిమాలతో ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్ చేసారనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసేవారు. ఓ సారి దర్శకుడు రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒక కథ రెడీ చేసుకోగా, అది వేటగాడు పేరుతో రూపొందింది.
ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా హీరోయిన్ కోసం చాన్నాళ్లపాటు ఆసక్తికర చర్చ నడిచింది. రాఘవేంద్ర రావు మాత్రం హీరోయిన్ విషయంలో శ్రీదేవి అనే మాట మినహా మరో మాట లేదు. నిర్మాతలు మాత్రం ఆమెను వద్దంటే వద్దని అన్నారు. అన్నగారి పక్కన శ్రీదేవి మరీ చిన్న పిల్లలా ఉంటుంది అన్నారు. అయితే శ్రీదేవికి కూడా అన్నగారి పక్కన చేయడానికి ఆసక్తి చూపలేదు. ఈ విషయం ఎన్టీఆర్ దగ్గరకు చేరడంతో నిర్మాతలని పిలిచి మాట్లాడారు. సినిమాల్లో నటించే వారికి సెంటిమెంట్ లు చూడరండి… ప్రేక్షకులు దేవుళ్ళు అని చెప్పారు.
ప్రేక్షకులు అన్నీ రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎందుకు బాధ, నాదీ బాధ్యత… మీకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడతా అని ఎన్టీఆర్ హమీ ఇచ్చారు. కథ బలంగా ఉండాలి గాని ఇవన్నీ ఎందుకు అంటూ ఎన్టీఆర్ చెప్పారు. అలానే శ్రీదేవిని కూడా ఆయనే స్వయంగా ఒప్పించారు. కట్ చేస్తే… ఆ జోడీ సూపర్ హిట్ అయింది. ఆ సినిమా హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, ఇవి బ్లాక్ బస్టర్ కొట్టాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ , శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కలిసి నటించబోతున్న విషయం తెలిసిందే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…