CI Anju Yadav : అంజూ యాదవ్.. ఈ పేరు గత కొద్ది రోజులుగా మీడియాలో తెగ నానుతుంది. నడిరోడ్డుపై విపక్ష నాయకులపై చేయిచేసుకున్నా.. సాటి మహిళను బూటుకాళ్లతో తన్ని వివస్త్రను చేసి ఈడ్చుకెళ్లినా.. ఆ అధికారిణిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఛార్జిమెమోతో సరిపెట్టేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ తొడగొట్టి సవాళ్లు విసురుతున్నా.. ఉన్నతాధికారులు కనీసం మందలిచ్చే సాహసం కూడా చేయడం లేదు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ అక్రమాలు, అవినీతిపై ఫిర్యాదులు ఉన్నా.. శాఖాపరమైన చర్యలకు పోలీసు శాఖ మాత్రం వెనకడుగు వేస్తూ వచ్చింది.
అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తున్నందువలనే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.రీసెంట్‌గా ఆమె జనసేన నేతపై చేయి చేసుకోగా, కేవలం ఆమె నుండి వివరణ కోరుతూ చార్జి మెమో జారీ చేశారు. గతంలో ఆమె హోటళ్ల ముందు తొడకొట్టడం, వెకిలి నవ్వులతో హెచ్చరించడం వంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే జనసేన నాయకుడు కొట్టే సాయిని సీఐ కొట్టిన విషయమై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎస్పీ. ఈ ఘటనపై పూర్తి స్ధాయిలో విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు పేర్కొన్నారు. సీఐ ప్రవర్తనపై ఉన్నత స్ధాయి అధికారితో విచారణ జరిపిస్తామన్నారు.
గతంలో అంజూ యాదవ్ పై ఉన్న ఆరోపణలు, వీడియోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియా వైరల్ గా మారాయని చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన ఘటనలో మాత్రం అంజూ యాదవ్ తో పాటు కొట్టే సాయిని కూడా విచారస్తామని అన్నారు. కేవలం అంజూ యాదవ్ ప్రవర్తన తీరుపై మాత్రమే పవన్ కల్యాణ్ తనతో ప్రస్తావించినట్లు వివరించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పవన్ ఎంట్రీతో ఇప్పుడు అంజూ యాదవ్ అరాచకాలకి బ్రేక్ పడేలా కనిపిస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…