Sonu Sood : రియల్ హీరో సోనూసూద్ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడానికి ఎక్కువ కృషి చేస్తూ ఉంటాడు. కరోనా సమయం నుండి సోనూసూద్ ఎక్కువగా సేవా కార్యక్రమాలపై దృష్టి పెడుతూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా సోనూసూద్ వాలిపోతాడు. సోనూసూద్ ఏపీ, తెలంగాణ ప్రజలు భారీ వర్షాల వల్ల పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి తన వంతు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వరద బాధితులకు ఆహారం, తాగునీరుతో పాటు మెడికల్ కిట్స్ అందజేస్తున్నామని సోనూసూద్ అన్నారు.
ప్రముఖ నటుడు సోనూసూద్ మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసేందుకు తన టీం పని చేస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలు వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి సమయంలో వారికి తాము అండగా ఉంటామని సోనూసూద్ వీడియోలో పేర్కొన్నారు. సాయం కోరుకునే వారు సోనూసూద్ చారిటీ ఫౌండేషన్ ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని చెప్పారు. మెయిల్‌లో సంప్రదించాలన్నారు. సోనూసూద్ సాయం చేయడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలని ఉన్న ఆయన నిబద్ధతను కొనియాడారు. సోనూసూద్ సాయం ప్రజలకు ఓదార్పునిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సోనూసూద్ తాజాగా విజయవాడలో బకెట్లు, చాపలు, దుపట్లు పంపిణి చేశారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు అని ఎప్పుడు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని సోనూసూద్ అన్నారు.కరోనా మహమ్మారి సమయంలో నేనున్నానంటూ వలస కార్మికులకు భరోసానిచ్చి ఎంతోమందిని ఆదుకున్న సోనూసూద్ తన సేవా కార్యక్రమాలతో భారత దేశ ప్రజలతో మన్ననలు పొందుతున్నారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరొక 2.5 కోట్ల రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా తమ బృందాలు పనిచేస్తాయని సోనుసూద్ పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…