David Warner : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గ్రౌండ్ లో ధనాధాన్ ఇన్నింగ్స్ లు ఆడే ఈ మేటి బ్యాటర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. సినిమా డైలాగులు, ఫైట్స్, సాంగ్స్ ను రీక్రియేట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటాడు. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే డేవిడ్ భయ్యాకు చాలా ఇష్టం. అందుకే కరోనా టైమ్ లో టాలీవుడ్ హీరోల డైలాగ్స్, పాటలకు రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. ముఖ్యంగా పుష్న సినిమాకి బ్రాండ్ ప్రమోటర్‌గా మారి అందులోని పాటలకు, డైలాగ్సులను ఎక్కువగా రీక్రియేట్ చేస్తూ వచ్చాడు.
ఎప్పటికప్పుడు డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులపై తన ప్రేమని వ్యక్త పరుస్తూనే ఉంటాడు.భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే వార్నర్.. ఇక్కడి పండుగలను కూడా జరుపుకుంటాడు.ఈ నేపథ్యంలోనే అభిమానులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశాడు. సోషల్ మీడియా వేదికగా బొజ్జ గణపయ్య ఫొటోను షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు. ఈ ఫొటోలో వార్నర్ రెండు చేతులు జోడించి గణపయ్యను ప్రార్థిస్తున్నట్లు ఉండగా… ‘భారత్‌లో ఉన్న నా స్నేహతులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మీకు సుఖ సంతోషాలు లభించాలని కోరుకుంటున్నాను’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టకముందే ఐపీఎల్‌లోకి వచ్చిన వార్నర్.. అద్భుత ప్రదర్శనతో స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. దాంతో అతను భారత్‌పై ఎనలేని ప్రేమను కనబరుస్తూ వచ్చాడు. ఆరంభంలో ఢిల్లీ డేర్‌డేవిల్స్ జట్టుకు ఆడిన వార్నర్.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మారాడు. సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. టైటిల్ అందించడంతో పాటు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకున్నాడు.. భారత్‌పై ఉన్న ప్రేమతో తన కూతురుకు ఇండియా పేరు వచ్చేలా పేరు కూడా పెట్టాడు. అయోధ్య రామమందిరంలో రామ లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా శ్రీరాముని అవతారం ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందరికీ అభినందన సందేశాన్ని పంపాడు. అలాగే, భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు.. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగమైన వార్నర్ త్వరలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనే అవకాశం ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…