KTR : ప్ర‌జాపాల‌న అంటే ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్క‌డ‌మా.. కేటీఆర్ ఫైర్‌..

KTR : తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక బీఆర్ఎస్ నాయ‌కుల దూకుడు కాస్త త‌గ్గింది అని చెప్పాలి. ముఖ్యంగా కేటీఆర్, హ‌రీష్ రావు మాత్ర‌మే త‌మ వాయిస్ వినిపిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.దిలీప్​ అరెస్టుపై బీఆర్ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు ఎక్స్​వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణవాది కొణతం దిలీప్​ను పోలీసులు అక్రమ కేసులు బనాయించి అదుపులోకి తీసుకున్నారని ఆయన దుయ్యబట్టారు.

గత కొంతకాలంగా ప్రభుత్వ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా పేర్కొంది. ఆయన అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్క‌డ‌మేనా? అని కేటీఆర్ నిలదీశారు. దిలీప్‌ను అక్రమంగా అదుపులోకి తీసుసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని దిలీప్ కొంతకాలంగా ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోందన్నారు.

KTR comments on present telangana government attitude
KTR

కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి రాలేదన్నారు.ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారని విమర్శించారు. అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది మీ భ్రమే అవుతుందని హెచ్చరించారు.ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింతమంది పుట్టుకు వస్తారన్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న దిలీప్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని డిమాండ్ చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

13 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

20 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago