Mega Family : మెగా ఫ్యామిలీకి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ఎవరు ఆపదలో ఉన్నా కూడా సాయం కోసం ముందు వచ్చే వారిలో మెగా ఫ్యామిలీనే ఉంటుంది. చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఆ కుటుంబానికి చెందిన చాలా మంది ప్రముఖులు ఎన్నో విరాళాలు అందిస్తూ వస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా అందరూ మెగా హీరోలు ఏదో ఒక రూపంలో ఇతరులకు సాయపడుతూనే ఉన్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. అయితే కేవలం నెల వ్యవధిలోనే మెగా ఫ్యామిలీ నుంచి రూ.9. 4 కోట్ల సాయం అందిందంటే సాయం చేయడంలో మెగా ఫ్యామిలీ ఎంత ముందుందో ఇట్టే అర్థంచేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి చిరంజీవి కోటి విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో 50 లక్షల విరాళం అందించారు. ఇక తండ్రి బాటలోనే తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు.ఇక ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన కల్యాణ్ భూరి విరాళమే అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ఏకంగా రూ. 6 కోట్ల ఆర్థిక సాయం ప్రకటిచారు. ఇందులో ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కోటి చొప్పున ప్రకటించారు పవన్. అలాగే ఏపీలోని వరద ప్రభావానికి గురైన 400 పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున అంటే మొత్తం 4 కోట్లు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు పవర్ స్టార్.
ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల విరాళం అందించారు. పవన్ కళ్యాణ్ సూచించిన పంచాయతీ రాజ్ శాఖకు 5 లక్షలు, మొత్తం 15 లక్షలు విరాళంగా ఇచ్చారు.అంతకుముందు కేరళలోని వయనాడ్ బాధితుల కోసం కూడా చిరంజీవి, రామ్ చరణ్ భారీ విరాళం అందేజేశారు. స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు చిరంజీవి. ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఫీసుల నుంచి ఫిష్ వెంకట్ కు ఫోన్లు వెళ్లాయట. ఈ విషయాన్ని ఫిష్ వెంకటే వెల్లడించారు. ‘ మెగా ఫ్యామిలీ నాకు అండగా నిలిచింది. నా ఆరోగ్య పరిస్థితిని చూసి చిరంజీవి, రాంచరణ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. వారు నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని నాకు ధైర్యన్నిచ్చారు అని అన్నాడు. మరోవైపు నిహారిక వరద ముంపునకు గురైన ఒక పది గ్రామాలకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని రాసుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…