Sleep : నిద్రించేటప్పుడు కలలు రావడం అనేది సహజం. దాదాపుగా ప్రతి ఒక్కరికీ నిత్యం కలలు వస్తుంటాయి. కొందరు పగటి పూటే కలలు కంటుంటారు. అయితే రాత్రి పూట చాలా మందికి పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఒక్కోసారి ఎవరో వచ్చి ఛాతి మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది. గొంతు పట్టుకున్నట్లు అవుతుంది. ఆ సమయంలో కాళ్లు, చేతులు కదిలిద్దామంటే కదలవు. మాటలు కూడా రావు. ఇలా చాలా మందికి జరుగుతుంటుంది. అయితే అసలు ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంది ? దీన్ని ఏమంటారు ? ఇలా జరిగేందుకు ఏమైనా కారణాలు ఉంటాయా ? అంటే..
అర్థరాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా తెల్లవారు జామున కొందరికి పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఒక్కోసారి దెయ్యం ఏదో వచ్చి ఛాతి మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో ఎటూ కదలలేరు. మాటలు కూడా రావు. దీన్నే స్లీప్ పరాలసిస్ అంటారు. మనిషి సగటు ఆయుర్దాయం 75 ఏళ్లు అనుకుంటే ప్రతి ఒక్కరికీ ఇలాంటి కలలు ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా నిద్ర లేచేటప్పుడు స్లీప్ పరాలిసిస్ సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక స్లీప్ పరాలిసిస్ వచ్చేందుకు ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. కానీ ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు. ఇక స్లీప్ పరాలిసిస్ స్థితి సుమారుగా 80 సెకన్ల వరకు ఉంటుంది. అమెరికాలో 1 శాతం మంది జనాభాకు ఏటా ఇలాంటి కలలు వస్తుంటాయని సర్వేలు చెబుతున్నాయి. స్లీప్ పరాలిసిస్ వచ్చిన వారు వెంటనే నిద్ర నుంచి మేల్కొంటారు. దెయ్యాలు అంటే భయం ఉన్నవారికి ఇలా జరుగుతుందని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో కచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా తెలియవు..!
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…