Renu Desai : ఒకప్పుడు ఆడి పాడి ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన అందాల భామలు కొన్ని కారణాల వలన నటనకు దూరమయ్యారు. కొందరు పెళ్లి చేసుకొని పిల్లలతో సంసార జీవితం గడుపుతుంటే, మరి కొందరు భామలు మాత్రం ఇతర రంగాలలో రాణిస్తున్నారు. అయితే సినిమాలపై ప్రేమని చంపుకోలేని కొందరు మంచి కథ, క్యారెక్టర్ చూసుకొని రీ ఎంట్రీ ఇస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఆ మధ్య వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చి తన అభిమానులకి మంచి ఫీస్ట్ అందించింది. ఇక ఇప్పుడు అదే బాటలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ పయనించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రేణూ దేశాయ్ కొన్నేళ్ల నుంచి నటనకు దూరంగా ఉంటున్నారు. జానీ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. పవన్ కళ్యాణ్‌తో పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత విడాకులతో ఆమె కొన్నాళ్ల పాటు వెండి తెరకు దూరమయ్యారు. పూణెలో కొడుకు అకీరా, కూతురు ఆద్యతో కలిసి ఉంటున్న రేణూ వారి బాగోగులు చూసుకుంటూ కాలం గడపుతుంది. అయితే కొద్ది కాలం క్రితం రేణూ దేశాయ్ దర్శకురాలిగా తన టాలెంట్ చూపించాలని భావించింది. ఆ ప్రయోగం విజయవంతంకాలేదు. ఇక ఇప్పుడు తిరిగి నటిగా తన సత్తా చూపించాలని అనుకుంటుంది.
దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆమె రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో తన రోల్ ఏంటి అనేది రివీల్ చేశారు రేణు. సినిమాలో హేమలత లవణం అనే కీలకపాత్రలో తాను నటిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా క్లారిటీ ఇచ్చింది రేణుదేశాయ్. హేమలత అంటే టైగర్ నాగేశ్వరరావు అక్క. మొత్తానికి అక్క పాత్ర ద్వారా రేణుదేశాయ్ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసింది. హేమలత లవణం గారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నేను బాగుంటాను అని నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశీకృష్ణకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చింది. పైగా రేణు తన సన్నివేశాల స్క్రిప్ట్‌ను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్ట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…