Disco Shanti : లేడీ సూపర్ స్టార్ నయనతార స్టైలే వేరు. అందరిలా ఆమె ఫోటో షూట్స్ చేయదు. సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టించదు. సినిమాల వరకే గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటుంది. లేడీ సూపర్ స్టార్‌గా రచ్చ చేస్తున్న నయనతార వివాదాల జోలికి కూడా పోదు. కానీ అనుకోకుండా పలుమార్లు విమర్శల బారిన పడుతుంటుంది నయన్. తాజాగా డిస్కో శాంతి.. నయనతార బట్టలపై సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇవి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి హీరోయిన్స్ ధరించే డ్రెస్సులపై బోల్డ్ కామెంట్స్ చేసింది.
సినిమాలో గ్లామర్‌గా కనిపించేందుకు డ్రెస్సుల ఎంపిక చాలా ముఖ్యం అని చెప్పిన డిస్కో శాంతి.. గ్లామర్ కాస్ట్యూమ్స్ ధరించినంత మాత్రాన ఏ హీరోయిన్ పై నెగెటివ్ ఇమేజ్ పడదు. నయనతారని ఉదాహరణగా తీసుకుంటే ఆమె ఎలాంటి కాస్ట్యూమ్స్ లో కనిపించినా అందంగా ఉంటుంది. ఎంపిక కూడా బాగుంటుంది. అన్ని రకాల కాస్ట్యూమ్స్ సరిగ్గా సరిపోతాయి. బిల్లా చిత్రంలో బికినీలో మెరిసినయ నయన్ ఎక్కడా అసభ్యంగా కనిపించలేదు. ఏ బట్టలు ధరించాం అనేది కాదు.. ఎలా కనిపించాం అనేదే ముఖ్యం అని డిస్కో శాంతి అన్నారు.
కొందరు టైట్ దుస్తులు ధరించి చాలా దారుణంగా ఉంటారు. బికినీ ధరించిన వారంతా అసభ్యంగా కనిపిస్తారు అని.. ఒంటినిండా బట్టలు కప్పుకున్న వారంతా అందంగా ఉంటారని అనుకోవడం తప్పు.. అని డిస్కో శాంతి అన్నారు. ఈమె కూడా ఒకప్పుడు వెరైటీ దుస్తులలో అందాల ప్రదర్శన చేస్తూ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. 90వ దశకంలో డిస్కో శాంతి పలు చిత్రాల్లో స్పెషల్ నంబర్స్ లో మెరిసింది. ఇక శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత వాటికి దూరంగా ఉంటూ వచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…