లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. స్ట్రాంగ్ ఉమన్‌గా, ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కి సరైన అర్థంగా నిలిచిన నయనతార హీరోలకు దీటుగా అశేష అభిమాన గణాన్ని సంపాదించుకుంది. కెరీర్ పరంగా సాఫీగా సాగుతున్నా పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా డిస్ట్రబెన్స్ ఉన్నాయి. శింబు, ప్రభుదేవా తర్వాత విగ్నేష్ శివన్ ప్రేమలో పడ్డ ఈ ముద్దుగుమ్మ ఇటీవల అతనిని పెళ్లి చేసుకుంది. అనంతరం వెంటనే షూటింగ్‌లో పాల్గొంది నయనతార. షూటింగ్ గ్యాప్‌లో హనీమూన్ కూడా చేసుకుంది. మళ్లీ ఇప్పుడు కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉంది.
కొన్నేళ్లుగా సినిమాలు చేస్తూ వస్తున్న నయనతార ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులు కూడబెట్టిందనే విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. నయనతార తన సొంతంగా సంపాదించిన ఆస్తులే ఏకంగా రూ.165 కోట్లు ఉంటాయని సమాచారం. ఆదాయపన్ను శాఖకి నయనతార సమర్పించిన పత్రాల్లో ఈ మొత్తం ఆస్తుల వివరాలు తెలిపినట్టు సమాచారం. సినిమాలతోపాటు పలు వాణిజ్య సంస్థల యాడ్‌లలోనూ నటిస్తున్న నయనతార బాగానే కూడబెట్టిందట. నయనతారకు హైదరాబాద్ లో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలోని తన తల్లిదండ్రులు నిర్వహిస్తున్న ఇల్లు.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది.
నయనతారకి ఒక లిప్‌బామ్ కంపెనీ కూడా ఉంది. తన స్నేహితురాలు వనిత రాజన్‌తో కలిసి ఈ కంపెనీని ప్రారంభించింది. మరోవైపు నిర్మాతగానూ రాణిస్తుంది నయనతార. ఇలా మున్ముందు మరిన్ని వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తుందట లేడీ సూపర్ స్టార్. ఇక ఇటీవల 20 కోట్ల విలువ గల జెట్ విమానం కొనుగోలు చేసింది. దానితో పాటు ఖరీదైన కార్లు కూడా ఈ అమ్మడు సొంతం చేసుకుంది. మొత్తానికి నయన ఆస్తుల చిట్టా చాలా పెద్దదనే చెప్పాలి. ప్రస్తుతం నయనతార తెలుగులో గాడ్ ఫాదర్ లో చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. సైరాలో ఆమె చిరుకి జోడీగా నటించిన విషయం తెలిసిందే. మరోవైపు హిందీలో జవాన్ తోపాటు తమిళంలో కనెక్ట్, ఇరైవన్, మలయాళంలో గోల్డ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…