Siva Balaji : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ కపుల్స్లో నటుడు శివ బాలాజీ, నటి మధుమిత జంట తప్పక ఉంటారు. వీరిద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది.. ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ సినిమాతో తెరంగేట్రం చేసిన శివ బాలాజీ.. ఆ తర్వాత ఎలా చెప్పను, దోస్త్, ఆర్య సినిమాల్లో నటించి అలరించాడు శివబాలాజి. 2009లో సహనటి మధుమితను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2004లో ఇంగ్లీష్ కారన్ మూవీలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో.. దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే తమ వివాహం అంత ఈజీగా కాలేదని… ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
జాతకాల ప్రకారం మధుమితను పెళ్లి చేసుకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయంతో మధుమితతో పెళ్లికి బ్రేకప్ చెప్పాడంట.ఏడాదిన్నర కాలం పాటు దూరంగా ఉండి.. చివరకు మళ్లీ పెళ్లికి ఒప్పించాడంట. మధుమితా మాట్లాడుతూ..” దాదాపు నాలుగేళ్ల పాటు మేం ప్రేమించుకున్నాము. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. ఇరు కుటుంబాల వాళ్లు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ సమయంలో శివ బాలాజీ ఫోన్ చేసి.. ‘మనకు పెళ్లి జరగదు.. జాతకాలు కుదరడం లేదు. మనం పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుందట’ అని చెప్పాడు. ఆ క్షణంలో ఏం మాట్లాడాలో తనకు అర్ధం కాలేదని, ఓకే అని చెప్పి గట్టిగా ఏడ్చేశానని మధుమిత ఎమోషనల్ అయింది.
అయితే తను బ్రేకప్ చెప్పిన తరువాత కూడా మనం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పాడు. అయితే నేను అందుకు నో చెప్పాను. ఎందుకంటే బాలజీని నేను భర్తగా మాత్రమే ఊహించుకున్నాను. మా ఇంట్లో జాతకాలను పెద్దగా పట్టించుకోరు. శివ బాలజీ వాళ్ల ఇంట్లో వాళ్లు జాతకాలను చాలా నమ్ముతారు. అలా మా మధ్య ఈఘటన జరిగిన ఏడాది తరువాత మళ్లీ బాలాజీ టచ్ లోకి వచ్చాడు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆప్పుడు మరోసారి జాతకాలు చూపిస్తే..బాగున్నాయని అన్నారు. అలా ఎన్నో అడ్డంకులు దాటుకుని 2009లో మా పెళ్లి జరిగింది” అని మధుమిత చెప్పుకొచ్చింది. శివ బాలాజీ బిగ్ బాస్ తొలి సీజన్ విన్నర్ అనే విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…