Sitara Ghattamaneni : మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సితార. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తండ్రి మహేష్ బాబు, తల్లి నమ్రత సితారకి మంచి స్వేచ్ఛను ఇవ్వడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది సితార. ఈ చిన్నారి నిత్యం ఏదో ఒక పోస్టు తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఆ మధ్య వెండితెరపై కూడా అడుగుపెట్టింది.తన తండ్రి నటించిన సర్కారు వారి పాటలో ఒక పాటకు స్టెప్పులు కూడా వేసింది.ఫ్యామిలీతో కలిసి విదేశాలలో తిరిగినప్పుడు కూడా బాగా ఫోటోలు దిగుతూ పంచుకుంటుంది.
సితార సోషల్ మీడియాకు ఎంత యాక్టివ్ గా ఉంటుందో గౌతమ్ సోషల్ మీడియాకు అంత దూరంగా ఉంటాడు. సితార కేవలం క్లాసికల్ డాన్స్ లే కాకుండా వెస్టర్డ్ డాన్స్ లు కూడా చేస్తూ ఉంటుంది.ఇటీవల లంగా ఓణి కట్టి సారంగదరియా పాటకి అదరగొట్టింది. ఇక తాజాగా సితార ఒక జ్యువెలరీ యాడ్లో నటించగా అది న్యూయార్క్ లోని ఒక షాపింగ్ మాల్ లో వేశారు.ఇక అందులో సితార హీరోయిన్లను మించి అందంతో కనిపించి అందరిని కట్టిపడేసింది. ఆ యాడ్‌లో సితార చాలా పెద్ద అమ్మాయిగా కనిపించడంతో ఇక సితార హీరోయిన్ అవ్వటం ఫిక్స్ అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
ఇక యాడ్ లో నటించినందుకు సితార కోటి రూపాయల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సితార మాట్లాడుతూ తన పారితోషికంపై స్పందించింది. తాను ఎంత తీసుకున్నాను అనే విషయాన్ని అయితే చెప్పలేదు గానీ తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను మాత్రం ఛారిటీకి ఇచ్చినట్లు పేర్కొంది. యాడ్ షూట్ మొత్తం చాలా సరదాగా సాగిందని, ప్రతి ఒక్కరు తనకు సపోర్టు చేసినట్లు చెప్పింది. తన యాడ్‌కు సంబంధించిన ఫోటోలను న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో కనిపించిన రోజు ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయని కూడా చెప్పింది సితార.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…