Roja : ఏపీలో వైసీపీ, జనసేన, టీడీపీల మధ్య ఏ రేంజ్ విమర్శలు సాగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇటీవల పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా వైసీపీ నాయకులపై దారుణమైన విమర్శలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ‘అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం మారాలని… అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలని… జనం బాగుండాలి అంటే జగన్ పోవాలని… “హాలో ఏపీ.. బైబై వైసీపీ” అనేది జనసేన ఎన్నికల నినాదం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత క్రైమ్ రేటు పెరిగిపోయిందన్నారు.
పాలించే నాయకులు బాధ్యతగా లేకపోవడం వల్లే రోజు రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందన్నారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఆ హత్యను కవర్ చేయడానికి గుండెపోటు నాటకం ఆడారని, తరువాత విషయం బయటకు పొక్కడంతో ఎవరో చంపారని చెప్పారని, నిజం బయటకొస్తుందనే భయంతో ఒక వ్యక్తిని చంపేశారని వైసీపీపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ నినాదం ఇప్పుడు జనాలలో బాగా ఇమిడిపోయింది. కొందరు అయితే ఫన్నీ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హాయ్ ఏపీ అంటూ రోజా బైబై వైసీపీ అన్నట్టు వీడియో క్రియేట్ చేశారు.
ఇక అలానే అంబటితో పాటు వైసీపీ మంత్రులు కూడా ఏదో సందర్భాలలో బైబై వైసీపీ అనగా, దానిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వాయిస్‌కి జత చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింత తెగ వైరల్గా మారింది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల రోజా పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ చేసింది. అతను ఎక్కువ తక్కువ మాట్లాడితే చెంప పగలగొడతానని వార్నింగ్ కూడా ఇచ్చింది. రోజా మాటలపై జనసైనికులు మండిపడ్డ విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…