Silk Smitha : ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చిన సిల్క్ స్మిత‌.. అంత‌టి స్టార్ ఎలా అయింది..? ఆమె ఎంత క‌ష్ట‌ప‌డిందంటే..?

Silk Smitha : సిల్క్ స్మిత‌.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కులకు తెలిసిందే. ఎన్నో సంవత్స‌రాల పాటు ఈమె తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఐట‌మ్ భామ‌గా, న‌టిగా మెరిసింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అర్థాంత‌రంగా త‌నువు చాలించింది. ఈమె బ‌యోపిక్‌ను వెండితెర‌పై తీశారు కూడా. అయితే ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చిన అమ్మాయి సిల్క్ స్మిత‌గా ఎలా స్టార్ అయింది.. అస‌లు ఆమె సినిమా ప్ర‌వేశం ఎలా జ‌రిగింది.. త‌దిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సిల్క్ స్మిత అస‌లు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఏలూరులో జన్మించిన ఈమె తండ్రి రాములు, తండ్రి నర్సమ్మ. ఆర్థిక స‌మ‌స్య‌ల‌ వల్ల విజయలక్ష్మిని 5వ తరగతిలోనే చదువు మానిపించారు. 14 ఏళ్లకే పెళ్లి చేశారు. కానీ భర్త, అత్తమామలు ఆమెను ఎప్పుడూ హింసించేవారు. తన కష్టాలను మేనత్తకు చెప్పుకోగా.. ఏదో ఒక పని ఇప్పిస్తా అని ఆమెను చెన్నైకి తీసుకువచ్చింది మేనత్త. అక్కడ తనకు తెలిసిన‌ వారితో మేకప్ వేయించడం నేర్పించడంతో జూనియర్ ఆర్టిస్టులకు మేకప్‌ చేసుకుంటూ గడిపేది. కానీ ఒక‌రోజు నిర్మాత విను చక్రవర్తి భార్య షూటింగ్ జరిగే దగ్గర సిల్క్ స్మిత‌ను చూసి ఈమె నటి అయితే బాగుంటుంది అని ఆమెను అడిగారు. ఆమె కూడా ఒప్పుకోవడంతో రెండు నెలలు తమ వ‌ద్ద పెట్టుకుని నటన, డ్యాన్స్ కెమెరా ముందు ఎలా ఉండాలి అనేది నేర్పించారు. ఆ తర్వాత స్మిత అని పేరు మార్చి సినిమాలో అవకాశం ఇచ్చారు.

Silk Smitha original name how show worked hard for films
Silk Smitha

అయితే చక్రవర్తి సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన స్మిత కు పేరు వచ్చి.. అది అలానే కొనసాగింది. కానీ ఆ తర్వాత కొంత మంది డబ్బు ఆశ చూపించి కేరళ తీసుకెళ్లి బి గ్రేడ్ సినిమాల్లో నటింపజేశారు. ఆ తర్వాత కూడా మిగితా సినిమాలో అవకాశాలు దకించుకున్న సిల్క్ స్మిత ఐటం గర్ల్ గా అలాగే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతలా అంటే అప్పుడు చిరంజీవి కూడా సిల్క్ స్మిత వస్తుంది అంటే లేచి నిలుచొని విష్ చేసేవాడు.

నటిగా పేరు బాగా సంపాదించిన‌ సిల్క్ స్మిత డబ్బు కూడా బాగానే సంపాదించింది. కానీ చదువు రాకపోవడంతో వేరే వారిపై ఆధార పడటం.. వారు మోసం చేయడం జరిగింది. ఇలాగే సిల్క్ స్మిత ఫైనాన్షియర్ కూడా ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరై మొత్తం డబ్బుతో పరారయ్యాడు. ఆ మోసాన్ని తట్టుకోలేకపోయిన సిల్క్ స్మిత బాగా కుంగిపోయింది. నటిగా క్రేజ్ తగ్గకపోయినా.. సినిమాల‌లో నటించలేదు. అప్పుడే తాగుడుకు బానిసైన సిల్క్ స్మిత 23 సెప్టెంబర్ 1996 న ఆత్మహత్య చేసుకుంది. అలా ఆమె అర్థాంత‌రంగా త‌నువు చాలించింది. ఇప్ప‌టికీ ఆమె డ్యాన్స్‌ను ఆస‌క్తిగా తిల‌కిస్తుంటారు.

Share
editor

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago