అభిమానుల హృదయాలను గెలుచుకున్న సైడ్ ఆర్మ్ త్రోయర్ రఘు.. భారత్ – బంగ్లా మ్యాచ్‌లో విచిత్ర ఘటన..!

టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. అడిలైడ్‌ ఓవల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. డక్ వర్త్ లూయిస్ విధానంలో 5 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌లో, ఆ తర్వాత బౌలింగ్‌లో సత్తాచాటింది. ప్లేయర్ల మెరుపు ఫీల్డింగ్- దీనికి బోనస్. వర్షం అంతరాయాన్ని కలిగించిన ఈ మ్యాచ్‌లో.. రోహిత్ సేన ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా తడపడింది. వెంటవెంటనే 6 వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు అద్దిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయారు. అయితే ఒకానొక సమయంలో మ్యాచ్ బంగ్లా చేతుల్లోకి వెళ్లిపోయిందంటే నమ్మశక్యం కాదు.

వర్షం అంతరాయం కలిగించడం.. ఆపై బంగ్లాదేశ్ 17 ఓవర్లలో 151 పరుగుల టార్గెట్ చేధించాల్సిరావడం.. ఓటమి పాలవడం చక చకా జరిగిపోయాయి. అయితే.. ఈ మ్యాచులో భారత సపోర్టింగ్ స్టాప్, సైడ్ ఆర్మ్ త్రోయర్ రాఘవేంద్ర చేసిన పని ఆసక్తికరంగా మారింది. బ్రష్ పట్టుకొని పదే పదే బౌండరీ లైన్ వద్ద కనిపించాడు. అతను ఇలా బ్రష్ పట్టుకొని ఎందుకు కనిపించాడని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. భారత ఇన్నింగ్స్ సజావుగా సాగినా, బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 7 ఓవర్లు పూర్తికాగానే వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత ఆట తిరిర్గి ప్రారంభమైనా మైదానం చిత్తడి చిత్తడిగా తయారయ్యింది.

sidearm thrower raghu viral after india and bangladesh match

బౌలర్లకు, ఫీల్డర్ల షూలకు మైదానంలో ఉన్న మట్టి అతుక్కుపోతోంది. ఇలా అవ్వడం వల్ల ఫీల్డర్లు వేగంగా కదలలేక తెగ ఇబ్బందిపడ్డారు. ఈ విషయం అర్థం చేసుకున్న టీమిండియా సైడ్ ఆర్మ్ త్రోయర్ రఘు(రాఘవేంద్ర) బ్రష్ పట్టుకొచ్చాడు. దీని సహాయంతో ఫీల్డర్లు ఎప్పటికప్పుడు.. షూలకు అంటిన మట్టిని తొలగించగలిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భారత్ విజయానికి అతడు కూడా తనవంతుగా సహాయం చేశాడంటూ నెటిజన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విజయంతో భారత్.. సెమీ ఫైనల్స్‌కు మరింత చేరువైంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే.. మొత్తం 8 పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.

Share
Usha Rani

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

14 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago