త్రివిక్ర‌మ్ హీరో అవ్వాల‌ని చూస్తున్నారా.. అస‌లు విషయం ఏంటి..?

మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఎన్ని సూప‌ర్ హిట్స్ అందించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా ద్వారా డైరెక్టర్ గా మారారు.తరుణ్ , శ్రేయ జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ వసూళ్ళను రాబ‌ట్ట‌డంతో త్రివిక్ర‌మ్ పేరు మోరు మ్రోగింది. ఇక అప్పటి నుండి వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్‌గా కూడా ఎదిగాడు. నవంబర్ 7వ తేదీన త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కావ‌డంతో ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో నాలుగవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నువ్వే నువ్వే సినిమాని విడుద‌ల చేయ‌బోతున్నారు.

అయితే త్రివిక్ర‌మ్ .. ఎన్టీఆర్, ప‌వన్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి మంచి హిట్ కొట్టారు. మ‌రి త్రివిక్ర‌మ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అలాంటి సినిమాలు విడుద‌ల చేయ‌కుండా నువ్వే నువ్వే ఎందుకు రిలీజ్ చేస్తున్నార‌నే ఆలోచ‌న‌లో ఉంది. అందుకు కార‌ణం పెద్ద హీరోల సినిమాలు విడుద‌ల చేస్తే ఆయా హీరోలు హైలైట్ అవుతారు. కాని త‌న బ‌ర్త్ డే రోజు త్రివిక్ర‌మ్ పేరు ఎక్కువ విన‌ప‌డాల‌ని నువ్వే నువ్వే చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధార‌లు ఇప్పుడు లైమ్ లైట్‌లో లేరు కాబ‌ట్టి త్రివిక్ర‌మ్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. అందుకే ఈ ఆలోచ‌న చేశార‌ని స‌మాచారం.

trivikram srinivas birth day nuvve nuvve releasing

ఇక త్రివిక్రమ్ ప్ర‌స్తుతం మ‌హేష్‌తో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. మహేష్ సినిమాను ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాను 2023 మార్చిలో విడుదల చేయాలని ఒక ప్లాన్ అయితే ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్తో వీలైనంత తొందరగా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ కావడంతో తరువాత సినిమాలను కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరపైకి తీసుకురావాలి అని ఆలోచనతో ఉన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago