Shubman Gill : టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇటీవల తన బ్యాట్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి తెగ వార్తలలో నిలిచాడు. అంతకముందు సచిన్ కూతురుతో ప్రేమాయణం అని కొన్ని రోజులు ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ సారాతో డేటింగ్ అని కొన్నాళ్లు ప్రాచారాలు సాగాయి. అయితే తాజాగా ఓ ఇంటర్యూలో గిల్ సౌతిండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మంధన్న అంటే తనకు చాలా ఇష్టమని గిల్ పేర్కొన్నట్టు కథనాలు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ రష్మిక, గిల్ ఫొటోలతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్, రష్మిక పేర్లు ట్రెండింగ్‌లో నిలిచాయి. టాలీవుడ్ టాప్ హీరో విజయ్ దేవరకొండ లవర్‌పైనే శుభ్‌మన్ గిల్ మనసు పారేసుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ ఈ వార్తలపై స్పందించాడు.. నేను ఏ మీడియాతో ఈ మాట చెప్పాను. నేను ఎవ్వరితో ఇలా చెప్పానో నాకు అయితే గుర్తులేదు.అసలు తన ఎవరో కూడా నాకు తెలీదు..’ అంటూ ఇన్‌స్టాలో కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్. దీంతో రష్మిక పరువు పోయినట్టు అయింది. నేషనల్ క్రష్ అయిన రష్మిక ఎవరో తనకు తెలియదు అని చెప్పడం ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఫాలో అవ్వడంతో పాటు ఒకే తరహా పోస్ట్‌లు పెట్టడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే కొద్ది రోజులకు ఈ ఇద్దరూ విడిపోయారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఆ తర్వాత శుభ్‌మన్ గిల్.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు రాగా, ఈ రూమర్లను నిజం చేస్తూ ఈ ఇద్దరూ కలిసి కాఫీ షాపులకు వెళ్లడం, డిన్నర్లు చేయడం వంటి పనులు మీడియాకు చిక్కడంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ నిజమేననే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్ తన క్రష్ రష్మిక మంధన్న అని తెలిపాడని వార్తలు రావడంతో ఇది మరో చర్చకు దారి తీసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…