Comedian Raghu Home : సాధారణంగా సినీ సెలబ్రెటీలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులలో ఎక్కువగా ఉంటుంది. శుభవార్తలైనా, బ్యాడ్ న్యూస్ అయినా అన్నింటికి సోషల్ మీడియా బెస్ట్ వేదిక. సెలబ్స్ తమ ఫ్యామిలీ విషయాలతో పాటు.. హోమ్ టూర్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కమెడియన్ రఘు కారుమంచి.. హోమ్ టూర్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్స్ స్టార్ హీరోల ఇల్లుని మించిపోయి ఉందిగా అని కామెంట్స్ చేస్తున్నారు.
రఘు అదుర్స్, లక్ష్మీ, కిక్, నాయక్, ఊసరవెల్లి.. లాంటి హిట్ సినిమాలతో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. 20 ఏళ్ళ క్రితమే ఆది సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన రఘు.. విలన్ గా, కమెడియన్ గా ఎక్కువ సినిమాలు చేశారు. కెరీర్ లో సుమారు 150కి పైగా సినిమాలలో నటించిన రఘు.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. కొన్నాళ్లు జబర్ధస్త్‌తో పాటు పలు టీవీ షోలు కూడా చేశాడు. అయితే కొన్ని కారణాల చేత బుల్లితెరకు సైతం గుడ్ బై చెప్పిన రఘు సినీ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చేసారు. ప్రస్తుతం సాధారణ వ్యక్తిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు లాక్ డౌన్ సమయంలో చాలా ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.
వైన్ షాప్ లో కూడా పని చేస్తున్నట్లు పలు ఫోటోలు అప్పట్లో నెట్టింట వైరల్ గా మారాయి. అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న రఘు కొద్ది కాలంలోనే ఒక లగ్జరీ ఇంటికి కూడా ఓనర్ అయ్యారని , తన స్నేహితుడి వల్లే రెండు బెల్ట్ షాపులకు ఓనర్ అయినట్లుగా తెలుస్తోంది. రఘు లేటెస్ట్ హోమ్ టూర్ వీడియోలో రఘు ఇల్లు.. వాకిలి.. వంటరూమ్, బాల్కనీ ఇలా అన్నీ.. చాలా లగ్జరీ లెవెల్ లో ఉన్నాయి. చూస్తుంటే.. స్టార్ హీరోల ఇళ్లకు ఏమాత్రం తగ్గకుండా నిర్మించుకున్నాడని చెప్పాలి. ఉన్నతమైన కమ్యూనిటీ మధ్య రఘు ఇల్లు నిర్మించుకోగా, ఇందులో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉంది. ఇక రఘు తన ఇంటి పరిసరాలు గ్రీనరీతో నింపేశాడు. పళ్ళు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుతున్నారు. మద్యం వ్యాపారంతోనే ఆయన కోట్లకు పడగలెత్తాడని అనుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…