Tata IPL 2023 : టి20 ఫార్మాట్ ఎంట్రీతో క్రికెట్ ముఖ చిత్రమే ఎంతగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . అప్పటి వరకు క్లాస్ గా సాగుతున్న క్రికెట్ లోకి ధనాధన్ షాట్లు ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంట్రీతో క్రికెట్ పక్కా కమర్షియల్ గా మారిపోయింది. ఐపీఎల్.. మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతుంది. అయితే టి20 ఫార్మాట్ ను మరింత రంజుగా మార్చడానికి బీసీసీఐ కొత్త ఐడియాలతో వచ్చేసింది. అయితే ఇప్పటి వరకు ఔట్ విషయంలో డీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉండేది. కాని ఇప్పుడు వైడ్, నో బాల్స్ కోసం సమీక్ష తీసుకునే వెసులు బాటు ఉంది.
మహిళల ప్రీమియర్ లీగ్ నుండి కొత్త రూల్ అందుబాటులోకి తీసుకొచ్చింది బీసీసీఐ. దీని ద్వారా ఆటగాళ్లు, వైడ్, నో బాల్ వంటి వాటిపై కూడా సమీక్ష కోరవచ్చు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వైడ్ కి, నో బాల్‌కి ‘డీఆర్‌ఎస్’ రివ్యూ కోరే వెసులుబాటు కల్పించింది బీసీసీఐ. అంపైర్ల నిర్ణయాలను ఛాలెంజ్ చేసేందుకు ప్రతి జట్టుకు మూడు డీఆర్‌ఎస్ రివ్యూలు అందుబాటులో ఉంటాయి. అంపైర్ వైడ్ ఇవ్వకపోయినా, నో బాల్ ఇవ్వకపోయినా సదరు బ్యాటర్ డీఆర్‌ఎస్ కోరుకునే అవకాశం ఉంది.. అనంతరం థర్డ్ అంపైర్, దానిని పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తాడు. రీసెంట్‌గా , యూపీ వారియర్స్-గుజరాజ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూపీ ప్లేయర్ గ్రేస్ హారీస్ ఈ విధంగా డీఆర్‌ఎస్ కోరి మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.
ఆ మ్యాచ్‌లో మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో విజయానికి 3 బంతుల్లో 6 పరుగులు అవసరం కాగా, హారీస్ వైడ్ పై సమీక్ష కోరి ఒక విలువైన పరుగును రాబట్టింది. దీంతో ఒక పరుగు తక్కువ కావడమే కాకుండా, అదనపు బంతి ప్రయోజనం చేకూరింది. రీసెంట్‌గా జరిగిన ఆర్సీబీ, డీసీ మ్యాచ్‌లోను నో బాల్ కోసం రివ్యూ కోరుకోగా, వారికి అనుకూలంగా రాలేదు. ఇక ఇదే రూల్‌ని పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లోనూ అమలు చేయబోతున్నారు. బంతి బంతికి రిజల్ట్ మారిపోయే పొట్టి క్రికెట్‌లో ప్రతీ పరుగు ఎంతో విలువైనదే కాబట్టి వీటికి కూడా డీఆర్‌ఎస్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఈ ఐపీఎల్ నుండి అందుబాటులోకి రానున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…