Shruti Haasan : కమల్ గారాల పట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గబ్బర్ సింగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా మారిన ఈ అమ్మడు ఆ తర్వాత మంచి చిత్రాలు చేసింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమాయణం నడిపి కొంత గ్యాప్ తీసుకుంది. ఆ ప్రేమకి బ్రేకప్ పడడంతో తిరిగి సినిమాలు చేస్తుంది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఏజ్ పెరిగినా ఛాన్స్ లు మాత్రం బాగానే కొట్టేస్తుంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారిపోయింది శృతి హాసన్. రీసెంట్ గా చిరంజీవి, బాలకృష్ణ సరసన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో నటించి మంచి హిట్స్ అందుకుంది.
ఇక ఇప్పుడు ప్రభాస్ సరసన సలార్ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ కొడితే శృతి హాసన్ క్రేజ్ పీక్స్‌కి చేరుకోవడం ఖాయం. అయితే కొన్నాళ్లుగా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో డేటింగ్ చేస్తోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే శృతిహాసన్.. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇక అప్పుడప్పుడు అతనితో కలిసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్‌తో ముచ్చటిస్తూ ఉంటుంది. తాజాగా శాంతనుతో కలిసి ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్ చాటింగ్ లో పాల్గొంది శృతిహాసన్. ఈ లైవ్ చాటింగ్ లో నెటిజన్స్ శృతిహాసన్ ను పలు ప్రశ్నలు అడిగారు.
‘నేను మీతో సహజీవనం చేయాలనుకుంటున్నాను’ అని ఓ నెటిజన్ అడగ్గా.. శృతిహాసన్ అతనికి నో చెప్పింది. మరో నెటిజన్ చాట్ చేస్తూ.. మీరు వర్జినేనా.. అని అడిగేశాడు. ఇక దాంతో శృతి హాసన్ కు కోపం ఆగలేదు. తిక్కరేగడంతో .. ఆనెటిజన్ కు బుర్రతిరిగిపోయేలా సమాధానం చెప్పింది బ్యూటీ. అయితే ఆ నెటిజన్ వర్జిన్ స్పెల్లింగ్ తప్పురాయడంతో ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ సరిగా రాయడం నేర్చుకో.. అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది. దీంతో అతగాడు మళ్లీ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ అయిపోయాడు. గతంలోను ఈ అమ్మడు ఇలాంటి పరిస్థితులు అనేకసార్లు ఎదుర్కొంది.