Harbhajan Singh And Suresh Raina : ఎన్టీఆర్- రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ దక్కిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత నాటు నాటు సాంగ్ అయితే అన్ని దేశాల ప్రేక్షకులని ఊపేసి వారితో కూడా నాటు నాటు అంటూ స్టెప్పులు వేయించింది. ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటుకి మరింత ఆదరణ పెరిగింది. అంతకుముందే నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ప్రపంచ దేశాల్లో కూడా వైరల్ అయింది. ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటు గురించి మరింతమంది సెర్చ్ చేస్తున్నారు.
జపాన్ కి చెందిన ఓ డేటా అనలిస్ట్ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం ఆస్కార్ వచ్చిన తర్వాత అంతకుముందు కంటే కూడా 10 రేట్లు ఎక్కువగా ఆ సాంగ్ గురించి సెర్చ్ చేస్తున్నారట. ఆస్కార్ వచ్చిన ఈ మూడు రోజుల్లోనే నాటు నాటు సాంగ్ ని ఏకంగా 1105 శాతం మంది వివిధ దేశాల నుంచి గూగుల్ లో వెతికారని తెలుస్తుంది. ఇక టిక్ టాక్ లో కూడా ఆస్కార్ వచ్చిన తర్వాత ఏకంగా 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి అని సమాచారం. టిక్ టాక్ ని మనదేశంలో బ్యాన్ చేసినా వేరే దేశాల్లో ఇంకా ఉంది కాబట్టి అందులో నాటు నాటు హంగామా సృష్టిస్తుంది.

ఇక తాజాగా ఈ పాటకు . భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనాలు అదిరిపోయే స్టెప్పులు వేశారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో కలిసి ఆడుతున్న ఈ ఇద్దరూ.. సరదాగా నాటు నాటుకు అదిరిపోయే స్టెపులు వేశారు. టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం కాళ్లు కదపడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌చరణ్-ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకు సినిమా ప్రేక్షకులు ఊగిపోతే.. ఇప్పుడు భజ్జీ-రైనా వేసిన స్టెప్పులకు క్రికెట్ అభిమానులు సైతం ఊగిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని నెటిజన్స్ తెగ షేర్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
'Naatu Naatu' from Suresh Raina and Harbhajan Singh. pic.twitter.com/s6kN0bdVIx
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2023