Shruti Haasan : లోకనాయకుడు కమల్‌హాసన్ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్, అందచందాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ శ్రుతి హాసన్. సాధారణంగా హీరోయిన్స్ మేకప్ లెస్, డీగ్లామర్ లుక్ షేర్ చేయడానికి ఇష్టపడరు. అది వాళ్ళ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడతారు. అయితే శృతి మాత్రం ఐ డోంట్ కేర్ అంటుంది. శ్రుతి హాసన్ ప్రస్తుతం ఓ పోస్ట్ వేసింది. అందులో తాను ఎలాంటి పరిస్థితులో ఉన్నానో వివరించింది. శ్రుతి హాసన్ అందులో మేకప్ లేకుండా కనిపించింది.
అలా ఒక్కసారిగా కనిపించడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అలా కనిపించడానికి ఓ కారణం కూడా ఉందని చెప్పుకొచ్చింది. తాను జ్వరంతో బాధపడుతున్నానని, సైనస్ కూడా వచ్చిందని, అంతే కాకుండా ఇది పీరియడ్ సమయం అని కూడా చెప్పేసింది. బ్యాడ్ డే, బ్యాడ్ హెయిర్ తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు, ఇష్టపడతారని భావిస్తున్నాను అంటూ సదరు ఫోటోలకు శృతి హాసన్ కామెంట్ జోడించింది. ఇక శృతి కెరీర్ గాడిలో పడగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది. శృతి హాసన్ ముంబైలో లవర్ శాంతను హజారికతో ఉంటుంది.
దాదాపు రెండేళ్లుగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శాంతను ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్. ఇతడు శృతి హాసన్ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్న పలు ఫంక్షన్స్ కి హాజరుకావడం విశేషం. ఆమధ్య శృతి హాసన్ కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. అనూహ్యంగా క్రేజీ ఆఫర్స్ తో పుంజుకుంది. రవితేజ క్రాక్ సినిమాతో శ్రుతి హాసన్‌కు హిట్ పడింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ సీనియర్ హీరోల సరసన నటిస్తుంది. చిరంజీవి, బాలయ్యలతో పాటు, ఇక ప్రభాస్ సలార్ సినిమాలోనూ హీరోయిన్‌గానూ చేస్తోంది. ఇవి హిట్ అయితే.. శ్రుతీ హాసన్ కెరీర్‌కు ఢోకా లేనట్టే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…