Shruti Haasan : కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అందం, అభినయంతో అదరగొడుతుంది.డ్యాన్స్ లోనూ తనకు తిరుగులేదు అనిపించుకుంది. శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు. గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. ఈ అమ్మడు సినిమాలతొ పాటు సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తుంటుంది. తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
శృతి హాసన్ రీసెంట్ గా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అయితే వీరసింహారెడ్డి ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుండగా, ఇందులో శృతి హాసన్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వివిధ రకాల భంగిమలతో కేక పెట్టించే విధంగా శృతి హాసన్ చేసిన రచ్చ ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ అమ్మడి స్టన్నింగ్ లుక్స్ నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. 2009లో శృతి హాసన్ లక్ అనే బాలీవుడ్ చిత్రంతో నటిగా పరిచయం అయింది. ఆ చిత్రాన్ని శృతి హాసన్ కి గుర్తింపు తీసుకురాలేదు. రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో శృతి హాసన్ జైత్ర యాత్ర మొదలయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…