Nara Lokesh : టీడీపీ నేత‌ల ముందు క‌న్నీరు పెట్టుకున్న నారా లోకేష్‌.. వీడియో వైర‌ల్..

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ విజయదశమి పండగ రోజున వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ‘‘దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం – మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం’’ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దామని చెప్పారు. అక్టోబ‌ర్ 23వ తేదీన విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య‌లో వీధుల్లోకి వ‌చ్చి “సైకో పోవాలి“ అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. సైకో జ‌గ‌న్ అనే చెడుపై మంచి అనే చంద్ర‌బాబు సాధించ‌బోయే విజ‌యంగా ఈ ద‌స‌రా పండ‌గ‌ని సెల‌బ్రేట్ చేసుకుందాం’’ అని నారా లోకేష్ తెలిపారు.

ఇక టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ లోకేష్ భావోద్వేగంతో మాట్లాడారు.. ఏ తప్పు చేయకున్నా అరెస్ట్ చేయడం బాధ కలిగించింది అన్నారు. ప్రజల కోసం పోరాడిన చంద్రబాబు అంటూ లోకేష్ కంటతడి పెడ్డారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని.. తమ ఆస్తులన్నీ బహిర్గతం చేశామని.. డబ్బే సంపాదించాలని చంద్రబాబే భావిస్తే రాజకీయాలు అవసరం లేదని చెప్పుకొచ్చారు.

Nara Lokesh gets emotional about his father chandra babu
Nara Lokesh

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో, ముఖ్యమంత్రిగా ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించారని.. అలాంటి చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం చంద్రబాబు పని చేశారని.. ప్రజలంతా ఆలోచించాలన్నారు. ఇవాళ చంద్రబాబు కుటుంబానికి ఇబ్బంది వచ్చిందని.. రేపు ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇదే పరిస్థితి రావొచ్చన్నారు. జగన్ ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయని.. టీడీపీ-జనసేన పోరాడకుంటే రాష్ట్రం ముక్కలు చేసి అమ్మేసేవారన్నారు. ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును జైల్లో పెట్టారని మండిపడ్డారు. టీడీపీ-జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయమని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏనాడైనా మా అమ్మ బయటకొచ్చారా?.. చివరకు మా తల్లిపైనా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు’ అంటూ లోకేష్ మండిపడ్డారు. ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాలకు తన తల్లి రాలేదని.. అసెంబ్లీ సాక్షిగా జగన్‌, ఆయన సైన్యం ఆమెను అవమానించారన్నారు. సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు తన తల్లికి తెలియవన్నారు. గవర్నర్‌ను కలిసేందుకు కూడా వెళ్లలేదని.. చంద్రబాబుకు పంపించే భోజనంలో విషం కలుపుతారని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago