CM KCR : తెలంగాణలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా, చివరిగా నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలున్నాయి. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ , బీజేపీలు యత్నిస్తున్నాయి. మరి ఓటరు ఎటున్నాడు, సర్వేలు ఏం చెబుతున్నాయి.. అయితే ఈసారి తెలంగాణ గడ్డపై ఎలాగైనా హస్తం జెండాను ఎగరవేయాలని భావిస్తున్న కాంగ్రెస్…. అందుకు తగ్గటుగానే అడుగులు వేస్తోంది.
బీఆర్ఎస్ ను ఓడించబోతున్నామని… తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమే అని తేల్చి చెబుతోంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకటేనంటూ ఆరోపించటమే కాకుండా… పలు అంశాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం… హంగ్ వస్తోందని సరికొత్త లాజిక్ ను తెరపైకి తీసుకువస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే… సర్వే రిపోర్టులు మాత్రం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఇండియా టుడే – సీ ఓటర్ సర్వేలో….కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా పలు కీలక అంశాలను ఇందులో ప్రస్తావించింది. 119 అసెంబ్లీ సీట్లు ఉన్న తెలంగాణాలో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు వస్తాయని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తేల్చింది. 2018 ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్.. ఈసారి కేవలం 49 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని వెల్లడించింది.
గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలిచిన బీజేపీ … ఈ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకునే అకాశం ఉందని వివరించింది. 2018 ఎన్నికల్లో ఇతరులు 11 మంది గెలవగా… ఈ ఎన్నికల్లో 8 మంది వరకు గెలవొచ్చని అంచనా వేసింది. ఇక ఓటింగ్ షేర్ విషయానికొస్తే కాంగ్రెస్ బలం భారీగా పెరగనున్నట్లు తెలిపింది ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే. గత ఎన్నికల్లో 28 శాతం ఓట్లను దక్కించుకున్న కాంగ్రెస్… ఈసారి 39 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. గతంతో పోల్చితే 11 శాతం ఓట్లు పెరుగుతాయని సర్వేలో వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…