Shruti Haasan : సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాకి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. చిత్రంలో బాలయ్య పెర్ఫామెన్స్‌కు ఫిదా అయ్యారు. అయితే బాలయ్య ఫ్యాన్స్ ఆయన హీరోయిజాన్ని చూస్తారు తప్ప లాజిక్స్ పట్టించుకోరు. కానీ క్రిటిక్స్ ఫోకస్ మాత్రం ఆర్టిఫిషియల్‌గా, అతిగా అనిపించే సీన్లపైనే. ప్రస్తుతం ఈ సినిమాలో అతిగా అనిపించిన సీన్లపై ట్రోల్స్ మొదలయ్యాయి. చిత్రం రిలీజ్ అయినప్పుడు ఇందులో ప్రత్యేకించి పర్టిక్యులర్ సీన్‌లో బాలయ్య ఒక కారు బానెట్‌పై తన్నగానే.. అది ఒక్కసారిగా పైకి లేచి కిందపడుతుంది.
బాలయ్య కోపంతో చూస్తుండగానే అంతే వేగంతో వెనక్కి పరుగెడుతుంది. వీటిని చూసి పల్నాటి బ్రహ్మనాయుడుని గుర్తు తెచ్చుకున్నారు నెటిజన్స్. 2003లో వచ్చిన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ చిత్రంలో బాలయ్య నటించిన కొన్ని సీన్లపై ఇప్పటికీ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆ చిత్రంలో బాలకృష్ణ ట్రైన్‌పై నిలుచుని మరో ట్రైన్‌కు ఎదురెళ్తే.. అది వెనక్కి వెళ్లిపోవడం లాజిక్‌కు అందకుండా ఉంటుంది. ఇక వీరసింహారెడ్డి చిత్రంలో ఈ సారి బాలయ్య కన్నా శృతి హాసన్‌పై ఎక్కవు ట్రోల్ నడుస్తుంది. ఈ సినిమా మొదటి 20 నిమిషాల్లో శ్రుతిహాసన్ చేసిన సెన్స్‌లెస్ యాక్టింగ్ చిరాకు తెప్పిస్తుందని ట్రోల్స్ ఎత్తి చూపుతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ సన్నివేశాలను ఎలా రూపొందించారని , వాటిలో శృతి నటనను ఎలా ఒప్పుకుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య విషయానికి వస్తే.. చాలా మంది నెటిజన్లు సీనియర్ పాత్రలో కొడుకు పాత్ర కంటే వయసులో చిన్నగా మరియు అందంగా కనిపిస్తున్నారని పోస్ట్ చేయడంతో యువ పాత్ర సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ అందుకుంటోంది. విడుదల సమయంలో కూడా, చాలా మంది ప్రేక్షకులు బాలకృష్ణ కొడుకు పాత్ర యొక్క లుక్ మరియు క్యారెక్టరైజేషన్ చిత్రానికి పెద్ద మైనస్ పాయింట్ అని భావించారు. ఇటీవలే OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్ స్టార్‌లో డిజిటల్ అరంగేట్రం చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…