OTT : కరోనా తర్వాత నుండి ఓటీటీలో సందడి చాలా నెలకొంది. మంచి సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఓటీటీలో తెలుగు తమిళ సినిమాలకు మించి మలయాళ సినిమాలు భారీ స్థాయిలో అందుబాటులోకి వచ్చేశాయి. అంతే కాకుండా డబ్బింగ్ ల రూపంలోనూ ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కావడంతో మలయాళ ఇండస్ట్రీ కి చెందిన సినిమాలు దేశ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటికీ తెలుగు తమిళ హిందీ భాషల్లోనూ వివిధ ఓటీటీల్లో మలయాళ క్రైమ్ యాక్షన్ డ్రామాలదే పైచేయి అనే విషయం తెలిసిందే.
తాజాగా మలయాళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన రెండు సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో విశేష ఆదరణని సొంతం చేసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నాయి.. ఆ రెండు సినిమాలలో ఒకటి ‘థంకం’ రెండవది ‘నాన్ పాకల్ నేరతు మయక్కమ్’. ఇందులో ‘థంకం’లో బీజు మీనన్ వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. అక్కడ మంచి ఆదరణని సొంతం చేసుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది. మంచి రేటింగ్స్ లభించాయి కూడా. త్రిస్సూర్ లో గోల్డ్ ఏజెంట్ లు గా పని చేసే కన్నన్ ముత్తు అనే ఇద్దరు వ్యక్తుల నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని రూపొందించారు.
ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ రీసెంట్ గా విడుదలైన క్రైమ్ డ్రామాల్లో అత్యుత్తమమైన సినిమాల్లో ఒకటిగా నిలవడం విశేషం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మరో మలయాళ మూవీ ‘నాన్ పాకల్ నేరతు మయక్కమ్’. ‘జల్లికట్టు’ మూవీతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న లిజో జోస్ పెల్లిసెరి తాజామూవీని తెరకెక్కించగా, ఇందులో మమ్ముట్టి హీరోగా నటించారు. డిసెంబర్ 12న విడుదలైంది. ఫిబ్రవరి 23న నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా వున్నా మమ్ముట్టి నటనకు ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇలా విభిన్నమైన కథలతో రూపొందిన రెండు మలయాళ సినిమాలు ఓటీటీల్లో హాట్ టాపిక్ గా మారడం విశేషం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…