Shruti Haasan : కమల్ గారాలపట్టి శృతి హాసన్ ఎప్పుడు ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. సినిమాల కన్నా ఈ అమ్మడు ఇతర విషయాలతో ఎక్కువగా వార్తలలో ఉంటుంది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసున్న ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తుంటుంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ఇన్‌డైరెక్ట్‌గా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. తాజాగా తన ప్రియుడిని దగ్గరికి పిలిచి ముద్దాడింది శ్రుతి. ఆ వెంటనే అతను కూడా శ్రుతికి తిరిగి కిస్ ఇచ్చి వెళ్లిపోయాడు.
జియో వరల్డ్ ప్లాజా లాంచ్‌లో ఈ ఇద్దరు అలా ముద్దులు పెట్టుకోవడం చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. చూస్తుంటే ఈ అమ్మడు త్వరలోనే శాంతనుని వివాహం చేసుకోనుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శాంతను, శృతి హసన్ వీడియో వైరల్‌గా మారాయి.ఇక శృతి హాసన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చకుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదల అయి మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. దీంతో శృతి హాసన్ కు మరింత డిమాండ్ పెరిగింది. ఓ వైపు యంగ్ హీరోలతో జతకడుతూనే మరోవైపు సీనియర్ హీరోలతోనూ సినిమాలు చేస్తుంది.
ఇటు తెలుగు, అటు తమిళ్ లోనూ నటిస్తూ బిజీ బిజీ గా ఉంటోంది. వీటితో పాటు భారీ ప్రాజెక్టుల్లోనూ భాగం అవుతోంది. ‘కెజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలోనూ నటిస్తోందని టాక్. ఇందులో ప్రభాస్ హీరోగా చేస్తున్నారు. ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోంది శృతి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. సినిమాల విషయంలో ఇంత ప్రొఫెషనల్ గా ఉండే శృతి హాసన్ పర్సనల్ లైఫ్ ను మాత్రం హ్యండిల్ చేయడంలో శృతి తప్పుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…