Shoaib Malik : సానియా మీర్జా కాపురంలో నిప్పులు పోసింది ఈమెనే.. పాపం ఎంత క‌ష్ట‌మొచ్చింది..

Shoaib Malik : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సంసార జీవితంకి సంబంధించి కొన్నాళ్లుగా అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇన్నాళ్లు ప‌చ్చ‌గా ఉన్న వారి సంసార జీవితంలో అల‌జ‌డి చెల‌రేగింద‌ని అందుకు కార‌ణం ఓ మోడ‌ల్ అని చెప్పుకొస్తున్నారు. భ‌ర్త‌తో ఏర్ప‌డిన విబేధాల కార‌ణంగా సానియా మీర్జా త‌న కొడుకుతో కలిసి వేరుగా ఉంటోందని వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి షోయబ్ మాలిక్ చేసిన మోసమే కారణమని తెలుస్తోంది.

పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లి చేసుకున్న భారత టెన్నిస్ స్టార్.. 2018లో కొడుకు ఇజహాన్‌కు జన్మనిచ్చింది. 12 ఏళ్ల పాటు చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జోడీ మధ్య ఇటీవ‌ల‌ సఖ్యత స‌రిగా లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని సోషల్ మీడియా కోడై కూస్తోంది. విడాకుల గురించి ఇరు దేశాల్లో పుకార్లు వెలవడుతున్నా.. జాతీయ చానెళ్లు వార్తలు ప్రచారం చేస్తున్నా.. ఈ ఇద్దరు స్పందించకపోవడంతో ఈ విష‌యం నిజమే అని కొంద‌రు గ‌ట్టిగా చెబుతున్నారు.. ఓ మోడల్‌తో షోయబ్ మాలిక్ పెట్టుకున్న వివాహేతర సంబంధమే సానియా మీర్జా కాపురంలో నిప్పులు పోసాయని ప్రచారం జరిగింది.

Shoaib Malik is staying with this model
Shoaib Malik

కొన్నాళ్ల క్రితం షోయబ్‌ మాలిక్‌కు సదరు మోడల్‌తో పరిచయమైందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆమెతో చనువుగా దారి తీసిందని, ఆ మోడల్ మోజులో పడిన షోయబ్ మాలిక్.. సానియాను పట్టించుకోవడం మానేసాడని వార్తలు షికారు చేశాయి. ఆమె పాక్ మోడల్ ఆయేషా ఒమర్ కాగా, స్థానిక మ్యాగజైన్ కోసం షోయబ్ మాలిక్‌తో కలిసి ఆమె గతేడాది ఓ బోల్డ్ ఫొటోషూట్‌లో పాల్గొంది. హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌పై అవగాహనలో భాగంగా ఈ ఫొటో షూట్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయేషా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. దీనిపై షోయ‌బ్ మాత్రం తెలివిగా స‌మాధానం ఇచ్చాడు. అయితే సానియాతో విభేదాల వ‌ల‌న ఆమెకు దూర‌మైన షోయ‌బ్.. అయేషాకి ద‌గ్గ‌ర‌య్యాడ‌ని స‌మాచారం.

41 ఏళ్ల అయేషా ‘కొల్లేగే జీన్స్’, ‘కుచ్ లమ్హే జిందగీ కే’, ‘మేరీ జాత్ జరా ఈ బెనేషన్’, ‘దిల్ కో మనానా అయా నహీ’, ‘జిందగీ గుల్జార్ హై, ‘బుల్బుల్లే’, ‘మేరి గుడియా’ మరియు ‘మేరా దర్ద్ బెజుబాన్ వంటి అనేక టెలివిజన్ సీరియల్స్‌లో ప్రముఖ పాత్రలు పోషించారు. 2015లో రొమాంటిక్ కామెడీ ‘కరాచీ సే లాహోర్’లో ప్రధాన పాత్రలో న‌టించి తన సినీ రంగ ప్రవేశం చేసింది, ఆ తర్వాత యుద్ధ చిత్రం ‘యల్ఘార్’ (2017) మరియు డ్రామా ‘కాఫ్ కంగనా’ (2019)లో సహాయ పాత్రలు పోషించింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago