న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అసలు ఆశలే లేని న్యూజిలాండ్ టీమ్ ను ఏకంగా 350 టార్గెట్ చేజ్ చేసే దిశగా తీసుకెళ్లాడు బ్రేస్‌వెల్ . అయితే చివరి ఓవర్లో చివరి వికెట్ గా వెనుదిరగడంతో ఇండియా 12 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. బ్రేస్‌వెల్ 78 బంతుల్లోనే 140 రన్స్ చేశాడు. అతని తుఫాను ఇన్నింగ్స్ లో ఏకంగా 12 ఫోర్లు, 10 సిక్స్ లు ఉన్నాయి. 350 రన్స్ చేజింగ్ లో ఒక దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి న్యూజిలాండ్ గెలవడం పక్కా అనుకునేలా చేశాడు బ్రేస్‌వెల్. సాంట్నర్ తో కలిసి ఏడో వికెట్ కు 162 రన్స్ జోడించి టీమిండియా వెన్నులో వణుకు పుట్టించాడు. చివరి విజయానికి 20 పరగులు అవసరం కాగా.. తొలి బంతికే సిక్స్ కొట్టాడు.
అయితే చివరి ఓవర్ వేసిన శార్దూల్.. రెండో బంతికి యార్కర్ తో బ్రేస్‌వెల్ ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్ పూర్తి అయిన తర్వాత శార్ధూల్ మాట్లాడుతూ.. విరాట్ బాయ్ సలహా వలనే నేను యార్కర్ వేసానని శార్ధూల్ చెప్పుకొచ్చాడు. ఇక లోకల్ బాయ్ సిరాజ్ 4 వికెట్లతో న్యూజిలాండ్ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. ఇక కీలకమైన సమయంలో హార్దిక్ పాండ్యా కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కుల్దీప్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెలరేగిపోయాడు. శ్రీలంకతో చివరి వన్డేలో సెంచరీ బాదిన అతడు.. ఇప్పుడు న్యూజిలాండ్ పై ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు.
గిల్ కేవలం 145 బంతుల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్ గా నిలిచాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓవైపు సహచరులంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ కు చేరుతుంటే.. గిల్ మాత్రమే చివరి వరకూ క్రీజులో నిలిచి టీమ్ కు భారీ స్కోరు సాధించి పెట్టాడు. అయితే ఆఖర్లో కివీస్ విజయానికి 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, శార్దూల్ ఠాకూర్ విసిరిన తొలి బంతినే బ్రేస్వెల్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత బంతి వైడ్ గా వెళ్లడంతో సమీకరణం 5 బంతుల్లో 13 పరుగులుగా మారింది. అయితే, శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బంతితో బ్రేస్వెల్ వీరోచిత ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…