Shaakuntalam : యశోద తర్వాత సమంత నటించిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కోసం సమంత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది చిత్ర బృందం.. ఈ చిత్రాన్ని తాజాగా నిర్మాతలు దిల్ రాజు, నీలిమ గుణతో కలిసి సమంత వీక్షించారు. అయితే ప్రచార కంటెంట్ గా ఎంచుకున్న ప్రీమియర్ షోస్ ఆలోచన బెడిసి కొట్టినట్టు తెలుస్తుంది. ఇవి ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న శాకుంతలం సినిమా 2D తో పాటు 3D లోనూ అందుబాటులో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు. అదులో భాగంగానే మూవీ టీమ్, 3D వర్షన్ పై బాగానే ఆశలు పెట్టుకున్నారు.
అయితే ప్రీమియర్ షో వలన పెద్ద దెబ్బ పడిందని చెబుతున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. టాక్ బాగా వస్తుందనే నమ్మకం తో ఉన్న మేకర్స్ కు పెద్ద షాక్ తగిలింది. ‘శాకుంతలం’ ప్రీమియర్ షో చూసిన కొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే ఈ ప్రీమియర్ షోకి మిక్స్డ్ టాక్ వస్తుండటం గమనార్హం. కొందరు సినిమా బాగుంది అంటుంటే.. మెజారీ ప్రేక్షకులు ఇదేం సినిమా అంటూ శాకుంతలంపై పెదవి విరిస్తున్నట్టుగా కనిపిస్తుంది.. గ్రాఫిక్స్ చాలా దరిద్రం గా ఉందని, స్క్రీన్ ప్లే కూడా ఏ మాత్రం బాగోలేదని అంటున్నారు. ఎన్నో క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ తీసిన గుణ శేఖర్ నుండి ఇలాంటి సినిమా ఊహించలేదంటూ తమ కామెంట్స్ లో తెలియజేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…