Virupaksha Trailer : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. యాక్సిడెంట్ తర్వాత కొన్నాళ్లు బెడ్‌కి పరిమితం అయిన తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకొని మరింత ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొత్త దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు సాయి తేజ్, సంయుక్త మీనన్. ఈ అమ్మడు మలయాళంలో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే భీమ్లా నాయక్ చిత్రంలో నటించిందో అమ్మడు రేంజ్ మారిపోయింది.
‘భీమ్లా నాయక్’ తర్వాత సంయుక్త చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ అమ్మడికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విరూపాక్ష చిత్రంలో సరికొత్తగా కనిపించనుందట. రింగు రింగుల హెయిర్ కు తోడు.. లంగాఓణీలో గ్లామర్ చూపిస్తూ మత్తెక్కించేలా కనిపిస్తుంది. ట్రైలర్ లో ‘ఎంత పెద్ద కళ్లుంటే అంత ఎక్కువ భయమున్నట్లు..’ అని హీరో సాయిధరమ్ తేజ్ డైలాగ్ చెప్పేటప్పుడు అక్కడ సంయుక్త లుక్ అందరికి పూనకాలు తెప్పించింది. ఆ ఒక్క షాట్‌లోనే సంయుక్తని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.
భీమ్లా నాయక్’లో రానా భార్యగా నటించిన సంయుక్త, ఉన్నది కొద్దిసేపు అయినా సరే ప్రేక్షకుల్నిఎంతగానో అలరించింది. ఇక ఆ తర్వాత కల్యాణ్ రామ్ ‘బింబిసార’ పోలీస్ గా నటించి అలరించింది. ఇక తర్వాత ధనుష్ ‘సార్’తో స్టార్ హీరోయిన్‌గా మారింది. మరి విరూపాక్ష చిత్రం ఈ అమ్మడికి ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి. రీసెంట్‌గా విడుదలైన విరూపాక్ష ట్రైలర్ నేను పుట్టి పెరిగిన ఊరు వచ్చి పదిహేనేళ్లైపోయింది.. రాకపోకలు నిషేధించిన ఓ మిస్టరీ విలేజ్‌లోకి సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడం.. ఓ గద్ద ఎగిరొచ్చి ఆ జీపు ఫ్రంట్ మిర్రర్‌కు తాకి చనిపోయిన విజువల్స్ అంచనాలు పెంచేశాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…