Sehwag : ప్ర‌పంచ క‌ప్‌కి అత‌నిని సెల‌క్ట్ చేయ‌క‌పోతే పెద్ద త‌ప్పు చేసిన‌ట్టే అన్న సెహ్వాగ్‌

Sehwag : గ‌త కొద్ది రోజులుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 హోరా హోరీగా సాగుతుంది. ఇది ఇప్పుడు మిడ్ స్టేజ్‌కి చేరుకుంది. మ‌రికొద్ది రోజుల‌లో ఐపీఎల్ పూర్తి కావడం ఆ త‌ర్వాత టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 కోసం టీమ్ ఇండియాలో చోటు సంపాదించడానికి చాలా మంది భారతీయ ఆటగాళ్ళు తమ సత్తా చూపిస్తున్నారు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి ప్రపంచ కప్‌నకు సెలెక్ట్ అవుతారంటూ జోష్యం చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లకు శివమ్ దూబే నుంచి గట్టి పోటీ ఎదురుకావచ్చని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. శివమ్ దూబే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.

అత‌ను ప్ర‌తి ఆట‌లోను విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఈ క్ర‌మంలో పొట్టి ప్ర‌పంచ క‌ప్‌లో దూబేకు బెర్తు ఖాయం. గ‌త రెండు సీజ‌న్లుగా సీఎస్కే త‌ర‌ఫున నిల‌క‌డ‌గా రాణిస్తున్న ఈ లెఫ్ట్‌హ్యాండ‌ర్ సీనియ‌ర్ల‌పై ఒత్తిడి పెంచుతున్నాడు. దూబే జోరుతో పంత్, సూర్య‌కుమార్, రాహుల్‌, శ్రేయ‌స్‌ల అవ‌కాశాలు దెబ్బ‌తింటున్నాయి అని సెహ్వాగ్ తెలిపాడు.క్రీజులోకి రావ‌డ‌మే ఆల‌స్యం బంతిపై ప‌గ‌బట్టిన‌ట్టు బౌండ్రీలు బాదే దూబే 4 మ్యాచుల్లోనే 160.86 స్ట్ర‌యిక్ రేటుతో 148 ప‌రుగులు సాధించాడు. అత‌డి జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ అందుకునేలా ఉన్నాడు. అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెలెక్ష‌న్ క‌మిటీ జూన్‌లో స్క్వాడ్‌ను ప్ర‌క‌టించ‌నుంది.

Sehwag interesting comments on team india selection for t20 world cup 2024
Sehwag

టీ20 ప్ర‌పంచ క‌ప్ రేసులో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లేదా రిషబ్ పంత్ వంటి చాలా మంది ఆటగాళ్లకు దూబే తీవ్రమైన తలనొప్పిలా మారాడు. టీ20 ప్రపంచకప్‌లో మిగిలిన ఆటగాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే నిలకడగా రాణించాల్సి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం, ఇది ముందుకు సాగడానికి ఏకైక మార్గంలా నిలిచింది అని అన్నాడు. ఇక భారత మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ కూడా శివమ్ దూబేకి మద్దతుగా నిలిచాడు. శివమ్ దూబే మైదానం వెలుపలకు బంతిని ఈజీగా కొట్టడం చూసి ఆనందిస్తున్నానని తెలిపాడు. అతను టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టులో ఉండాలి. దూబే గేమ్ ఛేంజర్‌గా మారగలడు. టీ20 ప్రపంచకప్‌కు మే 1 వరకు సమయం ఉంది. అంతకు ముందే భారత్ జట్టును ప్రకటించాల్సి ఉందని తెలిపాడు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago