Sehwag : గత కొద్ది రోజులుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 హోరా హోరీగా సాగుతుంది. ఇది ఇప్పుడు మిడ్ స్టేజ్‌కి చేరుకుంది. మరికొద్ది రోజులలో ఐపీఎల్ పూర్తి కావడం ఆ తర్వాత టీ 20 వరల్డ్ కప్ జరగడం మనకు తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 కోసం టీమ్ ఇండియాలో చోటు సంపాదించడానికి చాలా మంది భారతీయ ఆటగాళ్ళు తమ సత్తా చూపిస్తున్నారు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి ప్రపంచ కప్‌నకు సెలెక్ట్ అవుతారంటూ జోష్యం చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లకు శివమ్ దూబే నుంచి గట్టి పోటీ ఎదురుకావచ్చని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. శివమ్ దూబే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.
అతను ప్రతి ఆటలోను విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో పొట్టి ప్రపంచ కప్‌లో దూబేకు బెర్తు ఖాయం. గత రెండు సీజన్లుగా సీఎస్కే తరఫున నిలకడగా రాణిస్తున్న ఈ లెఫ్ట్‌హ్యాండర్ సీనియర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. దూబే జోరుతో పంత్, సూర్యకుమార్, రాహుల్, శ్రేయస్‌ల అవకాశాలు దెబ్బతింటున్నాయి అని సెహ్వాగ్ తెలిపాడు.క్రీజులోకి రావడమే ఆలస్యం బంతిపై పగబట్టినట్టు బౌండ్రీలు బాదే దూబే 4 మ్యాచుల్లోనే 160.86 స్ట్రయిక్ రేటుతో 148 పరుగులు సాధించాడు. అతడి జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ అందుకునేలా ఉన్నాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జూన్‌లో స్క్వాడ్‌ను ప్రకటించనుంది.
టీ20 ప్రపంచ కప్ రేసులో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లేదా రిషబ్ పంత్ వంటి చాలా మంది ఆటగాళ్లకు దూబే తీవ్రమైన తలనొప్పిలా మారాడు. టీ20 ప్రపంచకప్‌లో మిగిలిన ఆటగాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే నిలకడగా రాణించాల్సి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం, ఇది ముందుకు సాగడానికి ఏకైక మార్గంలా నిలిచింది అని అన్నాడు. ఇక భారత మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ కూడా శివమ్ దూబేకి మద్దతుగా నిలిచాడు. శివమ్ దూబే మైదానం వెలుపలకు బంతిని ఈజీగా కొట్టడం చూసి ఆనందిస్తున్నానని తెలిపాడు. అతను టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టులో ఉండాలి. దూబే గేమ్ ఛేంజర్‌గా మారగలడు. టీ20 ప్రపంచకప్‌కు మే 1 వరకు సమయం ఉంది. అంతకు ముందే భారత్ జట్టును ప్రకటించాల్సి ఉందని తెలిపాడు.