సెక్యూరిటీని తోసుకుంటూ జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన చిన్నారులు.. ఏం చేశారంటే..!

ఏపీ సీఎం జ‌గ‌న్ సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు విద్యాకానుక కిట్ల పంపిణీ పండుగలా జరుగుతోందని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది విద్యాకానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యాకానుక అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చాడు. విద్యాకానుక కిట్లలో.. 3 జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు ఉండ‌నున్నాయి.

ఓటు హక్కులేని చిన్న పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నది గత ప్రభుత్వ ఆలోచన.. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది ఈ చిన్నారుల మేనమామ ప్రభుత్వమే. అందుకే ఓ మేనమామగా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాల‌ని కృషి చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ అన్నారు. స్కూలు బ్యాగు సైజు పెంచామని, యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశామని పేర్కొన్నారు. ఈ ఒక్క పథకంపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.3,366 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. డిజిటల్ విద్యను ప్రతీ విద్యార్థికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయ‌న అన్నారు.

school kids came to cm ys jagan

అయితే చిన్న పిల్ల‌లు స్టేజ్ మీదకు రాగా, వారికి స్వ‌యంగా కిట్స్ అందించారు. చిన్నారుల‌తో న‌వ్వుకుంటూ స‌ర‌ద‌గా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. మీ జగనన్న నమ్ముకుంది దేవుడి దయను. మీ చల్లని దీవెనలు. నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన మంచి అని చెప్పడానికి గర్వపడుతున్నా. మిమ్మల్ని కోరేది ఒక్కటే.. వాళ్ల దుష్ప్రచారాలను నమ్మకండి. ఈ ప్రభుత్వం ద్వారా మీ ఇంట్లో జరిగిన మంచే కొలమానంగా తీసుకోండి అని అన్నారు. పేదపిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తే ఓర్వలేని బుద్ధి చంద్రబాబుదని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అన్నింట్లోనూ.. పేదల పట్ల వ్యతిరేకత బుద్ధి ప్రదర్శించాడని, అందుకు కారణం ఆయనలోని పెత్తందారీ మనస్తత్వమని చెప్పారు సీఎం జగన్‌.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago