Luna : భారతదేశ మొబిలిటీ సెగ్మెంట్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన కైనెటిక్ లూనా మీకు గుర్తుందా? ఈ టూ వీలర్ మోపెడ్.. ఇప్పుడు మళ్లీ తన ప్రస్థానం కొనసాగించేందుకు సిద్దమవుతుంది. అప్పట్లో లూనా ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉండేది. లూనా స్పెషలిస్ట్ రిపేయర్స్ కూడా ఉండేవారు. మంచి మైలేజ్‌తో చిన్న ఫ్యామిలీకి చాలా దగ్గరైన లూనా ఇప్పుడు తిరిగి ఇండియన్ రోడ్లపై చక్కర్లు కొట్టడానికి సిద్ధమవుతోంది! ‘ఈ లూనా’ను దేశంలో లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు కైనెటిక్ గ్రీన్ ఫౌండర్, సీఈఓ సులజ్జ ఫిరోదియా మోత్వాని. అప్పట్లో మనకు పెట్రోల్ లూనాలు అందుబాటులో ఉండేవి.
ఈ సారి మాత్రం ఎలక్ట్రిక్ లూనాను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనుకుంటోంది. కైనటిక్ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ డివిజన్ కైనటిక్ గ్రీన్.. పుణెలోని ప్లాంట్‌లో ‘ఈ-లూనా’ను తయారు చేయనుంది. కైనటిక్ గ్రీన్ వ్యవస్థాపకులు, సీఈఓ సులజా ఫిరోదియా మోత్వానీ .. ప్రయాణానికి అవసరమైన సీటింగ్ కంటే సరుకు రవాణా సామర్థ్యంపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల పూణెకు సమీపంలో కొత్త ప్లాంట్ ప్రారంభం కాగా, ఏడాదికి 10లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్లతో పాటు త్రీ వీలర్ వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉందని తెలుస్తోంది. కైనెటిక్ గ్రీన్ ఇప్పటికే భారత మార్కెట్లో 4 ద్విచక్ర వాహనాలను కలిగి ఉంది.
జింగ్ హెచ్ఎస్ఎస్ , జింగ్, జూమ్, ఫ్లెక్స్ లాంటి మోడళ్లను అందిస్తుంది. ద్విచక్ర వాహనాలే కాకుండా, కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ త్రీవీలర్స్, బగ్గీలను కూడా తయారు చేస్తోంది. ప్రస్తుతం ఇ-లూనాకు సంబంధించి ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్, రేంజ్, ధరకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. అయితే, ఈ మోపెడ్ ఒక్క ఫుల్ ఛార్జ్ తో 50-60 కి.మీ ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో సరికొత్త లూనా ధర దాదాపు రూ.2,000 ఉండేది. మరి ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న లూనా ధర ఎంత ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…