Roja : మెగా ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతున్న హీరో అల్లు అర్జున్. వైవిధ్యమైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప సినిమాతో బన్నీ తన నట విశ్వరూపం చూపించాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో రాబోతున్న ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే బన్నీకి వీరాభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వారందరిని మంచి పనులు చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్క నాటాడు బన్నీ. మొక్క నాటి నీరు పోస్తున్నప్పుడు దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన అభిమానులు పర్యావరణాన్ని, భూమిని రక్షించేందుకు మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశాడు. దాంతో చాలా మంది కూడా మొక్కలు నాటారు.
ఇక ఆ మధ్య హిందూపురంలో బన్నీ అభిమానులు స్వచ్చందంగా మంచి పని చేశారు. బన్నీ చెప్పకుండానే వారు ఒక అంబులెన్స్ ని ఏర్పాటు చేశారు. అవసరంలో ఉన్న వారికి ఫ్రీగా సర్వీస్ అందిస్తామని వారు అన్నారు. బన్నీ అభిమానులు చేసిన ఈ మంచి పనికి ఆయనతో పాటు అభిమానులని ప్రశంసించారు. వైసీపీ మంత్రి రోజా కూడా ప్రశంసలు కురిపించింది. బన్నీ లాంటి హీరో సినిమా ఇండస్ట్రీలో ఉండడం మా అదృష్టం అని ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైన బన్నీ రీల్ హీరోగానే కాదు రియల్ హీరోగాను మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నాడు.
అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాలు చేస్తూనే ఓటిటి లో కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కి అయితే ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచో కూడా ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో బన్నీ కి భారీ ఫాలోయింగ్ ఉంది. దాదాపు ఓ దశాబ్ద కాలం కితం నుంచే మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న బన్నీ ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో మరింత ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నాడు. రీసెంట్‌గా అయితే ఏకంగా 50 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకొని సౌత్ ఇండియా సినిమా దగ్గర ఏ సెలెబ్రెటీ కి కూడా లేని విధంగా భారీ నెంబర్ ఇప్పుడు బన్నీ సొంతం అయ్యింది. దీనితో సోషల్ మీడియా కింగ్ అల్లు అర్జున్ అనే మాట మరోసారి తాను ప్రూవ్ చేసుకున్నాడని అభిమానులు అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…