Mudragada : మరి కొద్ది నెలలో ఎన్నికల నగారా మోగనుంది. దీంతో అన్ని పార్టీలు కూడా భారీ ఎత్తుగడలు వేస్తూ అధికారం దక్కించుకోవాలని ప్లాన్స్ చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోవాలని భావిస్తుండగా, వైసీపీ మాత్రం సోలో ఫైట్‌కి సిద్ధమవుతుంది. అయితే ఈ క్రమంలో వైసీపీలోకి పలువురు ప్రముఖులని ఆహ్వానించేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలోని తన ఇంట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దీనికి వైసీపీ నేతలు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు హాజరయ్యారు.
ఈ పరిస్థితులని బట్టి ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాపు నేతగా, ఉద్యమకారుడిగా గోదావరి జిల్లాల్లో మంచి గుర్తింపు ఉంది. పాత, కొత్త తరం నేతలతో రాజకీయాలు నడిపిన ఘనత ముద్రగడకే దక్కుతుంది. తుని ఘటన తర్వాత మళ్లీ వార్తలలో లేని ముద్రగడకి వైసీపీ ఆహ్వానంద అందించినట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీలో చేరితే కాకినాడ ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోందట. అంతేకాదు.. కాకినాడ ఎంపీ స్థానంతో పాటు ప్రత్తిపాడు , పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీచేయొచ్చని ముద్రగడ ముందు మూడు ఆప్షన్‌లను వైసీపీ ఉంచిందట.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కాపు ఓటర్లకు ఆకట్టుకోవడానికి.. పవన్ పోటీ చేసే పక్క నియోజకవర్గం నుంచి ముద్రగడను రంగంలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14 నుండి తూర్పుగోదావరి జిల్లా పవన్ పర్యటన ఉండగా, ఈ పర్యటనకి జనసేన నుంచి కూడా ముద్రగడ పద్మనాభంకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.అయితే ముద్రగడకి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన కుమారుడ్ని అయినా సరే వైసీపీలోకి తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోందట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…