Sanghavi : హాయ్ రే హాయ్.. జాం పండు రోయ్’ అంటూ సింధూరం సినిమాలో రవితేజను తన వెంట తిప్పుకుంది హీరోయిన్ సంఘవి . కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 1993-2004 మధ్యకాలంలో దక్షిణాదిని స్టార్ హీరోయిన్‌గా చెలామణి అయ్యింది. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. మొత్తం 15 ఏళ్ల సినిమా కెరీర్‌లో 80కు పైగా చిత్రాల్లో నటించిన సంఘవి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది. కాగా 90 వదశకంలో హోమ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది సంఘవి.
సంఘవి తన కెరీర్‌లో సింధూరం, తాజ్ మహల్, నాయుడుగారి కుటుంబం, సూర్యవంశం, సమర సింహారెడ్డి, సీతారామరాజు, ప్రేయసి రావే, లాహిరి లాహిరి లాహిరిలో, సందడే సందడి వంటి హిట్ సినిమాలున్నాయి. కాగా ఆలస్యంగా అంటే 38 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. 2016లో బెంగళూరుకు చెందిన వెంకటేశ్ అనే ఐటీ ఉద్యోగితో కలిసి పెళ్లిపీటలెక్కారు. ఆతర్వాత 42 ఏళ్ల వయసులో ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఓ షోలో సందడి చేసిన సంఘవి.. యాక్టర్ పృధ్వీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన తనను మోసం చేశారంటూ వాపోయారు. అతను చేసిన మోసం త్వరగా తెలిసిపోయిందని చెప్పారు.
సంఘవి మాట్లాడుతూ.. ఓ రోజు షూటింగ్ కంప్లీట్ చేసుకుని నైట్ వస్తున్నాము.. అంతలో పృధ్వీ వచ్చి నా వైఫ్ ప్రెగ్నెంట్. కనీసం వీళ్లు కేక్ అడిగితే ఇవ్వడం లేదు అన్నాడు. నేను చాలా సీరియస్‌గా రెస్టారెంట్‌కు వెళ్లి పోయి.. కేక్ ప్యాక్ చేయించి ఇచ్చాను. తర్వాత ఎయిర్ పోర్టులో తనని, తన వైఫ్‌ను చూశాను అప్పుడే తెలిసింది ఆమె ప్రెగ్నంట్ కాదు అని. అయితే అసలు విషయం తెలియక నేను వెళ్లి అడిగాను. దాంతో పృధ్వీ బండారం బయట పడింది అన్నారు. ఆమెని ఎన్నో నెల అని అడిగాను. అదేంటి.. అన్నట్టు ఎక్స్ ప్రెషన్స్ పెట్టింది ఆమె. దాంతో విషయం అర్ధం అయ్యింది. ప్రెగ్నెంట్ కాకపోయినా.. అబద్దం చెప్పి ఆయన కేక్ తీసుకెళ్లారు అని సంఘవి చెప్పింది. దాంతో వెంటనే అందుకున్న మహేశ్వరి.. ఒక వేళ ఆయన ప్రెగ్నేంటేమో అని సరదా కామెంట్ చేసేసరికి.. అక్కడ అంతా నవ్వులు పూశాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…