Samyuktha Menon : ప్రస్తుతం టాలీవుడ్‌లో గోల్డెన్ భామగా మారింది అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. ఈ కేరళ కుట్టి మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో మరో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ధనుశ్‌తో ’సార్’తో పాటు తాజాగా విరపాక్షతో వరుస సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తోంది ఈ కేరళ కుట్టి. తెలుగులో ఈ అమ్మడు సైన్ చేసిన మొదటి చిత్రం ‘బింబిసార’. కానీ విడుదలైన ఫస్ట్ మూవీ ‘‘భీమ్లా నాయక్’. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో రానా దగ్గుబాటికి జోడిగా నటించింది. ఇక ధనుశ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సార్’ వీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఇక రీసెంట్‌గా సాయియి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ‘విరూపాక్ష’తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈమె నటించిన బింబిసార’ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. వరుస హిట్స్ అందుకున్నా కూడా ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్స్ లేవు. విరూపాక్ష సమయంలో ఈ బ్యూటీ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ క్రమంలో తనకి జరిగిన ఒక చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చింది. సంయుక్త మీనన్ ..నేను ఇప్పటికే 20 సినిమాల్లో నటించాను. అయినప్పటికీ ప్రతి సినిమాకి ముందు స్క్రీన్ టెస్ట్ లో పాల్గొంటాను స్క్రీన్ టెస్ట్ లో అన్ని హావ భావాలను పలికిస్తాను.
ఎమోషన్, జాలి,కరుణ, దయ,ఏడవడం, నవ్వడం,శృంగారం రసం ఇలా ప్రతి ఒక్క దాన్ని నేను చూపించాను. అయితే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంత మంది నా కళ్ళు చాలా చిన్నవిగా ఉన్నాయని విమర్శించే వాళ్లు. ఇప్పుడు వాటితోనే హావ భావాలను పలికిస్తున్నాను. నీ ఐస్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి అంటూ చాలా మంది మెచ్చుకుంటారు అని సంయుక్త చెప్పుకొచ్చింది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించి సంయుక్తకు కోపం ఎక్కువేనట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ సమంతకు తాను వీరాభిమానని తెలిపింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…