చిరంజీవి, కమల్ హాసన్. ఈ ఇద్దరు సినిమా పరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదిగారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేస్తూ..నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఇక చిరు కూడా వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ కొట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. అయితే ఈ ఇద్దరు కలిసి ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి చిత్రానికి దర్శకుడు ఎవరంటే.. తమిళ్ స్టార్ డైరెక్టర్ అయినా ‘గౌతమ్ మీనన్ అని సమాచారం.
ఈ సినిమా అంత ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని అంటున్నారు.అయితే ప్రస్తుతం కమల్ , చిరు ఇద్దరు బిజీ గా ఉన్నారు కాబట్టి వారి సినిమాలు పూర్తయ్యాక చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారట. ఈ లోపు గౌతమ్ మీనన్..రామ్ పోతినేని తో ఒక సినిమా ప్లాన్ చేసే ప్లాన్ ఉంది ,ఆ సినిమా కంప్లీట్ అయ్యాక చిరు, కమల్ ల సినిమా ఉండబోతుంది అని టాక్ .. ఇదే నిజం అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. ఇక కమల్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజగా ఉన్నారు. ఇక చిరు రాజకీయాలని పక్కన పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఓ సందర్భంలో కమల్ హాసన్ విశ్వరూపం గురించి మీకెవ్వరికీ తెలియదని..అతనిలో చాలా చెడు లక్షణాలున్నాయంటూ కళా తపస్వి విశ్వనాథ్ అన్నారు అతడిలోని మొదటి చెడు లక్షణం సినిమా గురించి అపారమైన నాలెడ్జ్ కలిగి ఉండటమేనన్నారు. రెండవది. దర్శకత్వంలో, నటనలో అతనికి తెలియనిదేదీ లేదు..ఇది మంచిది కాదంటూ అందర్నీ నవ్వించేశారు. తనను దర్శకుడిగా ఓ అవతారమే చేశారని..నటుడిగా రెండవ అవతారమెత్తాలని బలవంతం చేసింది కమల్ హాసనే అని కే విశ్వనాథ్ గుర్తు చేసుకున్న సందర్భముంది. ఇక కమల్ హాసన్, చిరంజీవి ఇద్దరూ ఆయనకు కావల్సినవారే. అలాంటి ఆ ఇద్దరిలో తేడా గురించి ప్రశ్నించినప్పుడు కమల్ హాసన్‌తో సినిమా తీస్తున్నప్పుడు ఎలాంటి నటన రాబట్టాలనే విషయాన్ని, చిరంజీవితో చేస్తుంటే ఆ కథకు తగ్గట్టు ఎలా నటింపచేయాలని ఆలోచిస్తానన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…