Samuthirakani : 10 నిమిషాల‌లో నా సినిమా స్క్రీన్ ప్లే మొత్తం త్రివిక్ర‌మ్ మార్చేశారు.. బ్రో డైరెక్ట‌ర్..

Samuthirakani : తొలిసారి మెగా హీరోలు ప‌వన్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం బ్రో. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన `వినోదయ సిత్తం` చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఆయనే దేవుడు(టైమ్‌)గా నటించారు. తంబిరామయ్య ముఖ్య పాత్ర పోషించారు. ఫ్యామిలీ డ్రామాగా, ఆద్యంతం ఎమోషనల్‌గా సాగిన ఈ సినిమాని తెలుగులో చాలా మార్పులు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీతో ఆయన మార్క్ అంశాలను జోడించ‌డంతో ఈ సినిమా స్కేల్‌ కూడా మారిపోయింది. ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ ప్లే అందించారు. మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ లో ఎంట్రీతో చాలా మార్పులు జరిగిపోయాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా సముద్ర‌ఖ‌ని .. తమ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. నేను ఓటీటీ (వినోదయ సీతమ్‌) సినిమా చేశానని త్రివిక్రమ్‌ సర్‌కి చెప్పాను. సార్‌ నన్ను కథ చెప్పమని అడిగారు, క్లుప్తంగా చెప్పాను. ఈ కథ ద్వారా భవిష్యత్తు తల్చుకుని చింతించడం కంటే వర్తమానంలో జీవించడం ముఖ్యమని నొక్కి చెప్పాలనుకుంటున్నాను అని అన్నాను. త్రివిక్రమ్ సార్ చిన్న విరామం తీసుకుని, పవన్ సార్ దేవుడి పాత్రలో నటిస్తే ఫర్వాలేదా అని నన్ను అడిగారు. నేను షాక్ అయ్యాను. అలానే సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ పోషిస్తాడు అని అన్నారు. అనంతరం కేవలం 10 నిమిషాల్లో త్రివిక్రమ్ సార్ మొత్తం స్క్రీన్‌ప్లే మరియు స్క్రిప్ట్‌ను మార్చారని, ఆయన ఎంతో గొప్ప టాలెంట్ కలిగిన వ్యక్తి అని అన్నారు సముద్రఖని.

Samuthirakani comments on director trivikram srinivas
Samuthirakani

బ్రో మార్పుల‌ని గ‌మనిస్తే.. ఇందులో టైమ్‌(దేవుడు)గా పవన్‌ కళ్యాణ్‌ నటించారు. తంబిరామయ్య పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ నటించారు. ఇందులో ఓ కంపెనీ సీఈవోగా సాయి కనిపించి అల‌రించ‌నున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ పాత్ర లెంన్త్ ని ఇందులో పెంచారు. ఆయనకు పాటలు డాన్సులు పెట్టారు. తమిళంలో అవేవీ ఉండవు. ఓ మాంటేజ్‌ సాంగ్ మాత్రమే ఉంటుంది. `బ్రో`లో మూడు పాటలు, ఒక ప్రమోషనల్‌ సాంగ్ ఉంది. `బ్రో`లో సాయికి లవ్‌ ట్రాక్‌ ఉంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌లు నటించారు. గ్లామర్‌ సైడ్ యాడ్‌ చేశాడు. తమిళంలో ఫైట్లు ఉండవు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago