Samuthirakani : తొలిసారి మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం బ్రో. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన `వినోదయ సిత్తం` చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఆయనే దేవుడు(టైమ్)గా నటించారు. తంబిరామయ్య ముఖ్య పాత్ర పోషించారు. ఫ్యామిలీ డ్రామాగా, ఆద్యంతం ఎమోషనల్‌గా సాగిన ఈ సినిమాని తెలుగులో చాలా మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఆయన మార్క్ అంశాలను జోడించడంతో ఈ సినిమా స్కేల్ కూడా మారిపోయింది. ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ లో ఎంట్రీతో చాలా మార్పులు జరిగిపోయాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా సముద్రఖని .. తమ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. నేను ఓటీటీ (వినోదయ సీతమ్) సినిమా చేశానని త్రివిక్రమ్ సర్‌కి చెప్పాను. సార్ నన్ను కథ చెప్పమని అడిగారు, క్లుప్తంగా చెప్పాను. ఈ కథ ద్వారా భవిష్యత్తు తల్చుకుని చింతించడం కంటే వర్తమానంలో జీవించడం ముఖ్యమని నొక్కి చెప్పాలనుకుంటున్నాను అని అన్నాను. త్రివిక్రమ్ సార్ చిన్న విరామం తీసుకుని, పవన్ సార్ దేవుడి పాత్రలో నటిస్తే ఫర్వాలేదా అని నన్ను అడిగారు. నేను షాక్ అయ్యాను. అలానే సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ పోషిస్తాడు అని అన్నారు. అనంతరం కేవలం 10 నిమిషాల్లో త్రివిక్రమ్ సార్ మొత్తం స్క్రీన్‌ప్లే మరియు స్క్రిప్ట్‌ను మార్చారని, ఆయన ఎంతో గొప్ప టాలెంట్ కలిగిన వ్యక్తి అని అన్నారు సముద్రఖని.
బ్రో మార్పులని గమనిస్తే.. ఇందులో టైమ్(దేవుడు)గా పవన్ కళ్యాణ్ నటించారు. తంబిరామయ్య పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించారు. ఇందులో ఓ కంపెనీ సీఈవోగా సాయి కనిపించి అలరించనున్నాడు. పవన్ కళ్యాణ్ పాత్ర లెంన్త్ ని ఇందులో పెంచారు. ఆయనకు పాటలు డాన్సులు పెట్టారు. తమిళంలో అవేవీ ఉండవు. ఓ మాంటేజ్ సాంగ్ మాత్రమే ఉంటుంది. `బ్రో`లో మూడు పాటలు, ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంది. `బ్రో`లో సాయికి లవ్ ట్రాక్ ఉంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్‌లు నటించారు. గ్లామర్ సైడ్ యాడ్ చేశాడు. తమిళంలో ఫైట్లు ఉండవు.