Samantha : నాగ చైతన్య నుండి విడాకుల తర్వాత సమంత పేరు ఏ రేంజ్‌లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. అసలు వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రాకపోగా నెటిజన్స్, గాసిప్ రాయుళ్లు మాత్రం తమకు నచ్చినట్టు కథలు అల్లేస్తున్నారు. ఇటీవల సమంత రెండో పెళ్లికి సంబంధించి కూడా తెగ ప్రచారాలు నడిచిన విషయం తెలిసిందే. సమంత రెండో పెళ్లికి సద్గురు పెద్దట. అతని ద్వారానే సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని.. అసలు సమంత పెళ్లికి, సద్గురుకి సంబంధమే లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇక సమంతకి రెండో పెళ్లి ఆలోచనలోనే లేదని.. ప్రస్తుతం అనారోగ్య కారణాలు ఉండటంతో.. వాటి నుంచి కోలుకున్న తరువాత ఫుల్ ఫోకస్ సినిమాలపై పెడుతుందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఏది ఎలా ఉన్నా త్వరలో సమంత బాలయ్య షోలో సందడి చేయడం ఖాయమని కొందరు ప్రచారం చేస్తున్నారు. అన్‌స్టాప్‌బుల్ షో తొలి సీజన్‌తో అదరగొట్టిన బాలయ్య ఇప్పుడు రెండో సీజన్‌తో సందడి చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఫస్ట్ సీజన్‌లో బాలయ్య చాలా చాలాకీగా సెలబ్రిటీలతో సంభాషించిన తీరు, ఆ టాక్ షోను నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఇప్పుడు రెండో సీజన్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సమంతతోపాటు పలువురు ప్రముఖులతో రచ్చ చేయబోతున్నాడట. సమంత – బాలయ్య ఎపిసోడ్ పై అందరూ దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే సమంత వ్యక్తిగత జీవితంతోపాటు అక్కినేని ఫ్యామిలీ మాజీ కోడలు కావడం, నాగచైతన్యకు మాజీ భార్య కావడంతో ఆ కోణంలో ప్రశ్నలు ఉంటే ఎలాంటి ఆన్సర్లు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా ఈ ఎపిసోడ్‌తో రేటింగులు పేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…