Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత నాగ చైతన్య గత ఏడాది అక్టోబర్ 2న విడిపోతున్న ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. వారి విడాకుల విషయం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే నిలుస్తుంది. కొందరు వారు విడిపోవడానికి కారణాలు ఇవి అంటూ ప్రచారాలు చేస్తుండగా, మరి కొందరు త్వరలోనే కలవబోతున్నారని చెప్పుకొస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘యశోద’. ఈ సినిమాలో సమంత గర్భవతిగా నటించారు. సినిమా పూర్తయ్యే క్రమంలో సమంత అనారోగ్యంతో ఇబ్బందిపడటం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
యశోద సినిమా సమంతకు మంచి పేరు తేగా, కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది. అయితే సమంత ఆరోగ్యంపై మాత్రం అభిమానులలో కొంత ఆందోళన నెలకొంది. మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు సమంత ప్రకటించడంతో అందరు అవాక్కయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేశారు. సినీ సెలబ్రిటీలు కూడా సమంత కోలుకుంటుందని ఆమె చాలా ధైర్యవంతురాలని పోస్ట్‌లు పెట్టారు.
అయితే నాగ చైతన్య కాని నాగార్జున కాని సమంత ఆరోగ్యంపై ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అయితే వారు సోషల్ మీడియాలో స్పందించకపోయిన సమంతకు అండగా నిలిచిందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య సమంత హెల్ విషయంలో ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ చాలా కేరింగ్‌గా చూసుకున్నాడట. తనపై చూపించిన కేరింగ్ వల్ల సమంత విడాకులను క్యాన్సిల్ చేసుకుని మళ్లీ చైతూతో కలవబోతుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు నాగ చైతన్య ఒక ప్రాజెక్టు కోసం సమంతతో జతకట్టబోతున్నట్లు సమాచారం. తొందరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. సమంత నాగ చైతన్య తిరిగి కలిస్తే మాత్రం అభిమానుల సంబరాలు మిన్నంటడం ఖాయం. అసలు వారిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జంట చాలా చూడముచ్చటగా ఉన్నారని, చిలకా గోరింకల మాదిరిగా ఉంటారని చెప్పుకొచ్చారు. నిండు నూరేళ్లు కలిసి ఉంటారని అందరు భావించగా, మూడేళ్లకే విడిపోవడం అందరిని బాధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…