Anchor Suma : కొన్ని దశాబ్ధాలుగా బుల్లితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న యాంకర్ సుమ.. ఈ గురించి తెలియని తెలుగు వాడు లేరంటే అతిశయోక్తి కాదేమో.. ఈమె సినిమా ఈవెంట్‌ని హోస్ట్ చేస్తుందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. చిన్న సినిమా అయిన పెద్ద సినిమా అయిన సుమ హోస్టింగ్ చేస్తుందంటే నెక్స్ట్ లెవల్‌కి తీసుకుని వెళ్తుంది. ఏళ్లకి ఏళ్లుగా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ బిగ్ ఈవెంట్ హోస్ట్ కావడంతో అగ్ర దర్శకులు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం సుమ యాంకరింగ్‌ని ఎంతగానో ఇష్టపడతారు.ఒకవైపు టీవీ షోస్, మరో వైపు సినిమా ఫంక్షన్స్ ఇంకో వైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది సుమ.
టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్ కాగా, ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తుంది . సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ తన దైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ ఎంతో మంది మనసులు గెలుచుకుంది. ఇక ఈమె రెమ్యునరేషన్ లకారాల్లోనే ఉంటుంది. ఓ ఏడాది క్రితం సుమ రెమ్యునరేషన్ ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం నాలుగు లకారాలు( నాలుగు లక్షలు) పైనే అని టాక్ వినిపిస్తుంది.
ఇక సుమ వయసు పై టీవీ షోలలో సినిమా ఫంక్షన్స్ లో ఎప్పుడూ జోకులు పేలుతూనే ఉంటాయి. అయితే ఆమె మాత్రం 15 ఏళ్ల పడుచు పిల్లనే అని సరదాగా చెప్పుకుంటుంది. ఇప్పటి వరకు సుమ అసలు వయస్సు ఎంతో ఆమెకు తప్ప మిగతా వారికి అంత పెద్దగా తెలియదు. వికీపీడియా ప్రకారం సుమ వయసు 47 ఏళ్లుగా చూపిస్తుంది. ఇక రాజీవ్ కనకాల వయసు 50 ఏళ్ల పైనే చూపిస్తుంది. ఇది తెలిసి జనాలు నోరెళ్లపెడుతున్నారు. 47 ఏళ్ల వయస్సులోను సుమ ఇంత యాక్టివ్‌గా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…