భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లైగర్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఇటీవల భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరపైకి తీసుకురావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానీ అంచనాలని తలకిందులు చేసింది లైగర్. తొలి రోజే నెగెటివ్ టాక్ ను మూటగట్టుకొని బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్స్ ను రాబట్టింది.
మొదటిరోజు రూ.9.57 కోట్లు అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత రెండవ రోజు కేవలం రూ.1.54 కోట్లు మాత్రమే సొంతం చేసుకుంది. ఇక మూడవరోజు కోటి రూపాయల షేర్, నాలుగో రోజు రూ.58 లక్షల షేర్ రాగా 5వ రోజు మాత్రం మరింత దారుణంగా కేవలం రూ.12 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఆచార్య తర్వాత అంత దారుణమైన ఫ్లాప్ చిత్రంగా లైగర్ చిత్రం నిలిచింది. భారీ హైప్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం దారుణంగా విఫలం కావడంతో నెటిజన్స్‌తోపాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ లైగర్ సినిమా ట్రోలింగ్ నుండి సమంత తప్పించుకుంది.
సాధారణంగా సమంత తన తోటి స్నేహితులు, కో ఆర్టిస్ట్ సినిమాలకి ఫ్రీ ప్రమోషన్ చేస్తుంటుంది. సోషల్ మీడియా ద్వారా సినిమాని చూడమని కోరుతుంది. అయితే లైగర్ విషయంలో సమంత ఆ పని చేయలేదు. ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఒకవేళ లైగర్‌పై ఏదైనా ట్వీట్ చేసి ఉంటే దారుణమైన ట్రోల్స్‌కి గురై ఉండేది. కాగా, సమంత.. విజయ్ దేవరకొండతో కలిసి రీసెంట్ గా ఖుషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం లేదు. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను పంచుకునే సామ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. దీంతో సమంత ఎందుకు ఇలా మారిందని పెద్ద చర్చ జరుగుతోంది. అయితే సమంత ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం శిక్షణలో ఉన్న కారణంగానే సోషల్ మీడియాకు దూరంగా ఉందని తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…